ఐయామ్‌ఫినోమ్‌ ఇండియాను నిర్వహించిన ఫినోమ్‌

The phenom who organized iamphenom India

ఏఐ, ఆటోమేషన్ మరియు టాలెంట్ ఎక్స్‌పీరియన్స్‌తో పని యొక్క భవిష్యత్తు పరివర్తన..

● ప్రతిభ అనుభవాలను పరివర్తింపజేస్తున్న సీఎక్స్ఓలు, సీహెచ్ఆర్ఓలు, హెచ్ఆర్ నాయకుల కోసం భారతదేశ మొదటి ఇంటెలిజెంట్ టాలెంట్ ఎక్స్‌పీరియన్స్ కాన్ఫరెన్స్.
● ముఖ్యఅతిథి తెలంగాణ గౌరవనీయ ఐటీ, ఈ & సి పరిశ్రమలు & వాణిజ్య మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబుచే ప్రారంభం.
● పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, భారత క్రీడా దిగ్గజం అభినవ్ బింద్రా ప్రత్యేక కీలక ప్రసంగం.

హైదరాబాద్: అంతర్జాతీయ ఏఐ కంపెనీ అయిన ఫినోమ్‌, హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్‌లో తన మొదటి ఐయామ్‌ఫినోమ్‌ ఇండియా సదస్సును ముగించింది. 500 మంది సీనియర్ హెచ్‌ ఆర్ నిపుణులు, సిఎక్స్‌ఓలు, సిహెచ్‌ఆర్‌ఓలు మరియు ఆలోచనాపరులను ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఈ కార్య క్రమం మేధస్సు, ఆటోమేషన్, అనుభవం ద్వారా ప్రతిభావంతులను పొందడం, నిర్వహించడం యొక్క భవిష్యత్తును పునర్నిర్వచించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

పని ఆకృతిని మార్చిన అత్యాధునిక ఏఐ, ఆటోమేషన్‌పై ఈ సదస్సులో చర్చ జరిగింది. డిజిటల్ పరివర్తన యుగం లో వేగంగా నియమించుకోవడానికి, మెరుగ్గా అభివృద్ధి చెందడానికి, ఎక్కువ కాలం ఉద్యోగులను నిలబెట్టుకునేందు కు ఫెనామ్ ఇంటెలిజెంట్ టాలెంట్ ఎక్స్‌పీరియన్స్ ప్లాట్‌ఫామ్ ఆయా సంస్థలను ఎలా శక్తివంతం చేస్తుందో విశ్లేషిం చింది. తెలంగాణ ఐటీ, ఈ & సి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ డి.శ్రీధర్ బాబు ఈ సదస్సును ప్రారంభించారు. భారతదేశ శ్రామికశక్తి ల్యాండ్‌స్కేప్‌ను రూపొందించడంలో ఏఐ, ఆటోమేషన్ కీలక పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ” “రాబోయే దశాబ్దంలో తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే మా లక్ష్యం. ఈ మార్పు ముఖ్యముగా ఏఐ డ్రైవర్లు, సెమీకండక్టర్స్ మరియు క్వాంటం కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలపై బలమైన దృష్టిని కలిగి ఉంటాయి. ఈ వృద్ధికి మద్దతుగా, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ వంటి కార్యక్రమాల ద్వారా మేము టాలెంట్ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించాము. మా వర్క్‌ఫోర్స్ శిక్షణ పొంది భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఐయామ్‌ఫినోమ్‌ ఇండియా వంటి సంచలనాత్మక కార్యక్రమాన్ని నిర్వహించడం తెలంగాణకు గర్వకారణం. భారతదేశ ఆర్థిక ఆశయాలకు అను గుణంగా నైపుణ్యం కలిగిన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని రూపొందించడంలో ఏఐ ఆధారిత వినూత్నత ప్రధానమైనది. హైదరాబాద్‌కు చెందిన యునికార్న్ అయిన ఫెనామ్ వంటి సంస్థలు మరింత అనుసంధానించబడిన కార్యాలయా లను నిర్మించడానికి సంస్థలకు సాధికారత కల్పించడంలో ఫినోమ్‌ వంటి సంస్థలు కీలకమైనవి’’ అని అన్నారు.

ఐయామ్‌ఫినోమ్‌ ఇండియా ముఖ్యాంశాలు..

● వృద్ధిని పెంచేవిగా ఏఐ, ఆటోమేషన్: ఫినోమ్‌ సీఈఓ, సహ-వ్యవస్థాపకుడు మహే బాయిరెడ్డి మాట్లాడుతూ ఒక బిలియన్ మందికి సరైన పనిని కనుగొనడంలో సహాయపడే ఫినోమ్‌ లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా హెచ్ ఆర్‌ని ఎలా మారుస్తుందో నొక్కిచెప్పారు. “భారతదేశం అంతర్జాతీయ శ్రామికశక్తి వినూత్నతలో ఒక పవర్‌ హౌస్. ఐయామ్‌ ఫినోమ్‌ ఇండియాతో, మేం ఏఐ యొక్క సామర్థ్యాన్ని మాత్రమే ప్రదర్శించడం లేదు- ఉత్పాదకతను వెలికి తీయడానికి, అర్ధవంతమైన వ్యాపార ఫలితాలను అందించడానికి హెచ్ఆర్ నాయకుల కోసం పరివర్తనాత్మక పర్యావరణ వ్యవస్థను మేం సృష్టిస్తున్నాం. పని భవిష్యత్తు ఇక్కడ, మేధస్సు, ఆటోమేషన్, అనుభవంతో ఆధా రితం” అని ఆయన అన్నారు.
● థాట్ లీడర్‌షిప్, ఇన్నోవేషన్: ఏఐ, టాలెంట్ మేనేజ్‌మెంట్ కలయికను చాటిచెబుతూ ఫినోమ్‌ సహ వ్యవస్థాపకు డు, ప్రెసిడెంట్, సీఓఓ హరి బాయిరెడ్డి ఇలా అన్నారు: “అసాధారణమైన ప్రతిభ అనుభవాలు కేవలం పోటీ ప్రయోజనం కాదు; ఆధునిక వ్యాపారంలో మనుగడ కోసం అవి చాలా అవసరం. వర్క్‌ఫోర్స్ ఉత్పాదకతను వెలికి తీయడానికి, వినూత్నతలను పెంపొందించడానికి ఫెనామ్ భారతీయ సంస్థలతో భాగస్వామి కావడం గర్వంగా ఉంది.”
● ఎంటర్‌ప్రైజ్ సక్సెస్‌పై ప్రత్యేక స్పాట్‌లైట్స్: ప్రముఖ సంస్థల నుండి సీఎక్స్ఓలు ప్రతిభావంతులను పొందడం, నిర్వహణలో ఏఐ, ఆటోమేషన్ ప్రభావవంతమైన ఫలితాలను ఎలా అందించగలవో తెలియజేశారు.
● టెక్నాలజీ ప్రదర్శనలు, నెట్‌వర్కింగ్: హెచ్ఆర్ లీడర్‌లకు నెట్‌వర్క్ పెంచుకోడానికి, సవాళ్లను పంచుకోవడానికి, భారతదేశ డైనమిక్ వర్క్‌ఫోర్స్ అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను అన్వేషించడానికి సాటిలేని అవకా శాలను ఈ సదస్సు అందించింది. ఉత్పాదకత, వ్యక్తిగతీకరించిన ఉద్యోగుల పెరుగుదల, హెచ్‌ఆర్ టెక్ కన్సాలిడే షన్‌పై ప్యానెల్స్ హెచ్‌ఆర్, టెక్ లీడర్‌ల మధ్య ఆకర్షణీయమైన చర్చలకు దారితీశాయి. పాల్గొనేవారు ఫినోమ్‌ యొక్క ఏఐ ఆధారిత పరిష్కారాలను ప్రత్యక్షంగా అనుభవించారు. ప్రతిభావంతులను పొందడం, అభివృద్ధి చేయడం, నిలబెట్టుకోడాన్ని ఆప్టిమైజ్ చేసే మార్గాలను కనుగొన్నారు. ఈ కార్యక్రమం భారతదేశ శ్రామిక శక్తి సవాళ్లను సహకరించడానికి, పరిష్కరించడానికి హెచ్ఆర్ నాయకులకు ఒక వేదికను అందించింది.
● స్ఫూర్తికి వేదిక: ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, భారతీయ క్రీడా దిగ్గజం అభినవ్ బింద్రా చేసిన ప్రత్యేక కీలక ప్రసంగంతో ఈ కార్యక్రమం ముగిసింది. మానసిక స్థితిస్థాపకత శక్తి, తనను తాను గుర్తించడం, తరువాతి తరం క్రీడా ఛాంపి యన్‌లకు సాధికారత కల్పించడంపై తన దృక్పథాలను పంచుకున్నారు. హాజరైనవారు “లేక్ మ్యాన్ ఆఫ్ ఇండి యా” ఆనంద్ మల్లిగవాడ్ నుండి కూడా ప్రేరణ పొందారు. సుస్థిరదాయక విధానాలు, సమాజ ఆధారిత ప్రభా వాన్ని ఆయన నొక్కి చెప్పారు.
● టాలెంట్ ఎక్స్‌పీరియన్స్ అవార్డ్స్: టాలెంట్ అనుభవాలను మెరుగుపరచడానికి ఏఐ, ఆటోమేషన్‌ను ఉప యోగించి రాణిస్తున్న భారతదేశానికి చెందిన సంస్థల వేడుకలతో కార్యక్రమం ముగిసింది.
ఫెనోమ్ ప్లాట్‌ఫామ్ పని చేసే విధానాన్ని చూడటానికి, ఇక్కడ డెమోని బుక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Stuart broad truly stands as a force to be reckoned with in the world of test cricket. Loaded baked potatoes recipe are a culinary marvel, transforming a humble spud into a decadent, flavorful delight.