అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో బన్నీని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. కోర్టు మెయిన్ గేటు నుంచి కాకుండా వెనక గేటు నుంచి బన్నీని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు తనపై పెట్టిన కేసును క్వాష్ చేయాలంటూ బన్నీ పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు ప్రస్తుతం విచారిస్తోంది.
అల్లు అర్జున్ పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు…
..105, 118(1) రెడ్ విత్ 3/5
బి ఎం ఎస్ సెక్షన్ల కింద కేసు.
. 105 సెక్షన్ నాన్ బేరబుల్ కేసు
… నేరం రుజువైతే ఐదు నుండి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం..
.. బి.ఎన్.ఎస్ 118(1) కింద ఏడాది నుంచి పదేళ్లు శిక్ష పడే అవకాశం