సాయి పల్లవి, తన సహజ నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నటి. ఇటీవల ఆమె నటించిన అమరన్ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం హిందీలో భారీ బడ్జెట్ రామాయణం సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సాయి పల్లవి, ఈ సినిమాతోనే వార్తల్లో నిలుస్తున్నారు.అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆమెపై సోషల్ మీడియాలో పలు రకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. కొలీవుడ్‌కి చెందిన ఓ మీడియా సంస్థ సాయి పల్లవి రామాయణం సినిమా కోసం తన జీవన శైలిలో భారీ మార్పులు చేసుకున్నారని పేర్కొంది.ఈ వార్తల ప్రకారం, సాయి పల్లవి షూటింగ్ పూర్తయ్యే వరకు నాన్ వెజ్ తినడం మానేసిందని, బయట ఫుడ్ అస్సలు తినడంలేదని, అంతేకాకుండా విదేశాలకు వెళ్లినప్పుడు కూడా తన వ్యక్తిగత వంటవాళ్లను వెంట తీసుకెళ్తోందని ప్రచారం జరిగింది. ఈ రూమర్లపై సాయి పల్లవి తాజాగా ఘాటుగా స్పందించారు.ట్విట్టర్ వేదికగా ఆమె ఈ నిరాధారమైన వార్తలపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆమె ట్వీట్‌లో స్పష్టం చేసింది నాపై ఎన్నో రకాల రూమర్లు వచ్చాయి.
ప్రతిసారి మౌనం పాటించాను. కానీ, ఈసారి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది.నిరాధారమైన వార్తలు రాయడం జర్నలిజం కాదు.ఇలాంటి వాటికి పాల్పడిన వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.సాయి పల్లవి తన విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తి. మేకప్ లేకుండా సహజత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ నటి, ఎంచుకునే కథలలోనూ సార్ధకతను తీసుకురావడంలో నైపుణ్యాన్ని చూపుతుంది. ఈ మధ్య వచ్చిన రూమర్లు ఆమెను తీవ్ర ఆవేదనకు గురి చేసినప్పటికీ, ఆమె గంభీరమైన మరియు స్పష్టమైన ప్రకటన ద్వారా ఈ విషయాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారు. సాయి పల్లవి స్పందనపై అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియాలో ఆమె ట్వీట్‌ను షేర్ చేస్తూ “నువ్వు నిజమైన ప్రేరణ. ఇలాంటి రూమర్లు నీపై ప్రభావం చూపనివ్వకు” అంటూ అనేక అభిప్రాయాలు వ్యక్తం చేశారు.