నిరుద్యోగులు ఎదురు చూస్తున సీటెట్ పరీక్ష ప్రకటన విడుదల అయింది.
CTET | ఉపాధ్యాయ అర్హత పరీక్ష సీటెట్ అడ్మికార్డులను సీబీఎస్సీ (CBSE) విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీటెట్ పరీక్షను సీబీఎస్సీ ఏడాది రెండు సార్లు నిర్వహిస్తున్నది. ఈ ఏడాది డిసెంబర్ సెషన్‌కు సంబంధించి.. 14, 15 (శని , ఆదివారం) తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పేపర్-1, పేపర్-2 పరీక్షలు ఉంటాయి.
పేపర్-1 ఒకటి నుంచి 5వ తగతి వరకు బోధించే ఉపాధ్యాయుల కోసం, పేపర్-2 ఆరు నుంచి 8వ తగతి వరకు బోధించే టీచర్ల కోసం పరీక్షను నిర్వహిస్తారు. పరీక్ష వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా పరీక్ష కేంద్రంలో ప్రవేశించేటప్పుడే బయోమెట్రిక్ తీసుకోనున్నారు. ఎవరైనా బయోమెట్రిక్ మర్చిపోయినా వారి పేపర్లను పరిగణనలోకి తీసుకునేది లేదని సీబీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్షకు లేట్ వస్తే ప్రవేశం లేదని అధికారులు తెలిపారు.
పరీక్ష తేదీ: డిసెంబర్ 14, 15
పరీక్ష సమయం: పేపర్-2- ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
పేపర్-1- మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు
వెబ్‌సైట్: ctet.nic.in