పెళ్లి పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. మొదట వెంటబడటం తర్వాత మోసం చేయడం పరిపాటిగా మారింది. తాజాగా ఓ రీసెర్చ్ చేస్తున్న అమ్మాయిని పోలీస్ అధికారి పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబర్చుకున్నారు. లక్నోలోని ఐఐటీ లో సైబర్‌క్రైమ్, క్రిమినాలజీపై అధ్యయనం చేస్తున్న ఓ అమ్మాయి ఏసీపీతో పరిచయం ఏర్పడింది. ఇదే అదనుగా తీసుకున్న పోలీస్ అధికారి పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబర్చుకున్నారు. అనంతరం మాటమార్చడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసును విచారించిన పోలీసులు అతడిని విధుల నుంచి తప్పించిన సీపీ.. విచారణ కోసం అడిషనల్ డీసీపీ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు.
బాధితురాలు ఐఐటి కాన్పూర్‌లో పీహెచ్‌డీ చేస్తున్నది. సైబర్‌క్రైమ్, క్రిమినాలజీపై అధ్యయనం చేస్తున్నది. ఇందులో భాగంగా కాన్పూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ACP) మహమ్మద్ మోహిసిన్ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత ఇద్దరిమధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆమెను ప్రేమలోకి దించిన ఏసీపీ.. తన భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. మాయమాటలు చెప్పి ఆమెపై అఘాయిత్యానికి ఒటిగట్టాడు. అనంతరం ఇచ్చిన మాటను తప్పడంతో మోసపోయానని గ్రహించిన ఆమె నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
తీవ్రమైన సెక్షన్లు నమోదు
డీసీపీ అంకితా శర్మ, ఏడీసీపీ అర్చన సింగ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. దీంతో వారు కాన్పూర్ ఐఐటీలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాధితురాలు చెప్పిన దాంట్లో నిజం ఉందని తేలడంతో సీపీ అఖిల్ కుమార్‌కు నివేదిక అందించారు. దీంతో ఏసీపీపై అత్యాచారం సహా తీవ్రమైన సెక్షన్ల కింద ఏసీపీపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అతడిని విధుల నుంచి తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.