CM Chandrababu held meeting with TDP Representatives

మరికాసేపట్లో ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం 1.00 గంటకు ఢిల్లీకి వెళ్లనున్నారు. అందుకోసం వెలగపూడిలోని సచివాలయం ఎదురుగా ఉన్న హెలి ప్యాడ్ నుంచి హెలికాఫ్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారితో ఆయన చర్చించనున్నారు.

ఇదే క్రమంలో ఢిల్లీలోని బీజేపీ పెద్దలతోనూ ఆయన భేటీ అవుతారు. బీజేపీ పెద్దల కోరిక మేరకు శనివారం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఎన్డీఏ అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఎన్డీయే తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు ఈ నెల 16, 17 తేదీల్లో ఇద్దరు నేతలు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. శనివారం అసెంబ్లీ సమావేశాలకు ఇద్దరు ముఖ్య నేతలు అందుబాటులో ఉండరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో తెలుగువారు ఎక్కువగానే నివాసం ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kejar pertumbuhan ekonomi 8 persen, bp batam prioritaskan pengembangan kawasan strategis. Un реасеkеереrѕ іn lebanon ѕау iѕrаеl hаѕ fіrеd on thеіr bаѕеѕ deliberately. Latest sport news.