కీలక నిజాలు బయటపెట్టిన వ‌ర్రా ర‌వీంద్ర రెడ్డి

గత వైసీపీ హయాంలో సోషల్ మీడియా లో అసత్యప్రచారాలు , అసభ్యకర పోస్టులు , వీడియోలు పోస్టు చేసి నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా లో ఇదే విధంగా అధికార పార్టీల నేతలపై పోస్టులు పెడుతుండడం , మహిళలను కిచ్చపరిచే విధంగా వ్యవహరిస్తుండడం తో కూటమి సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంలో పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేయడం తో వైసీపీ సోషల్ మీడియా టీం ను అదుపులోకి తీసుకుంటున్నారు.

తాజాగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి.. కడప రెండో అదనపు మెజి స్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం రవీందర్‌రెడ్డికి జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అలాగే ఈ కేసులో అరెస్టయిన మరో ఇద్దరు నిందితులు ఉదయ్, సుబ్బారెడ్డిలకు 41A నోటీసులు ఇచ్చి పంపాలని న్యాయమూర్తి పోలీసులకు తెలిపారు. . ఈ నేప‌థ్యంలో రిమాండ్ రిపోర్ట్‌లో వర్రా రవీంద్ర‌రెడ్డి సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌టపెట్టారు. ఐప్యాక్ టీమ్‌ కంటెంట్ ఇస్తే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేవాళ్ళమ‌ని తెలిపారు.

వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకుని నాయకులు, వారి కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టేవాళ్ళమ‌ని అన్నారు. వైసీపీ సోష‌ల్‌మీడియా బాధ్య‌త‌లు సజ్జల భార్గవరెడ్డి తీసుకున్న త‌ర‌వాత‌ మరింత రెచ్చిపోయామ‌ని చెప్పారు. జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవరెడ్డి బెదిరించాడని అన్నారు. 2023 నుండి త‌న ఫేస్‌బుక్ ఐడీతో భార్గవరెడ్డి పోస్టులు పెట్టాడని తెలిపాడు. షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకర పోస్టులు పెట్టామ‌ని ఒప్పుకున్నారు. ఆ పోస్టులు పెట్టాలని అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి త‌మకు కంటెంట్ ఇచ్చారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

号美?. Discover the secret email system…. Used 2016 winnebago via 25p for sale in monticello mn 55362 at monticello mn en23 010a.