ఇటీవల కాలంలో మంత్రి కొండా సురేఖ వరుస వివాదాల్లో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య నాగార్జున ఫ్యామిలీ పై అనుచిత వ్యాఖ్యలు చేసి కోర్ట్ చేత మొట్టికాయలు వేయించుకుంది. ఆ తర్వాత కూడా పలు విమర్శల పాలైంది. తాజాగా వరంగల్ మార్కెట్‌లో ఓ మాఫియా దందా చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అనర్హులకు మార్కెట్ లో షాపులను కేటాయించారని ఆమె ఆరోపించారు. మంగళవారం వరంగల్ లక్ష్మీపురంలోని కూరగాయల మార్కెట్‌ను సందర్శించి మార్కెట్‌లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూరగాయల మార్కెట్ లో ఓ మాఫియా దందా చేస్తుందని . అనర్హులను గుర్తించి తిరిగి షాపులను స్వాధీనం చేసుకుంటామన్నారు. చిరు వ్యాపారులను గుర్తించాలన్నారు. లైసెన్స్ ఇచ్చి మార్కెట్‌లో చోటు కల్పించాలన్నారు. గత సెక్రటరీ కేటాయించిన దుకాణాల పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్‌లో పార్కింగ్‌తో పాటు మౌళిక సదుపాయలు కల్పిస్తామన్నారు.
డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించడంతో పాటు కూరగాయల మార్కెట్ సమీపంలో వర్మీ కంపోస్ట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, అందరికి లాభం జరిగే విధంగా అర్హులకు షాపులను ప్లాట్స్ కేటాయిస్తామన్నారు. అద్దెల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని హామీ ఇచ్చారు. అలాగే డ్రా పద్ధతిలో దుకాణాలను.. కూరగాయల విక్రయాలు ప్లాట్ లను కేటాయిస్తామని. కూరగాయల మార్కెట్‌లోనే పూల దుకాణాలకు చోటు కలిపిస్తామని , త్వరలోనే కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తామన్నారు. మార్కెట్ లోని దుకాణాల పై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదికను ఇవ్వాలని సెక్రటరీ, కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు.