APPSC గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్ష వాయిదా

APPSC Group2

2025 జనవరి 5 న నిర్వ్హయించాలనుకున్న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష మరోసారి వాయిదా పడింది. గ్రూప్ -2 ఉద్యోగానికి సిద్దమయ్యే అభ్యర్థులకు అనుగుణంగా ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పరీక్షకు సన్నద్దమయ్యేందుకు మూడు నెలల పాటు సమయం ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 23 న మెయిన్స్ పరీక్షకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది.

ఈ పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ (APPSC) కమిషన్‌ని కోరారు. సిలబస్ మార్పులు, పూర్తిస్థాయిలో సన్నద్ధత కోసం మరికొంత సమయం పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుద్యోగుల అభ్యర్థన, ఆందోళన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలని పలువురు ప్రజా ప్రతినిధులు సైతం ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. దీంతో కమిషన్‌ తాజాగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

నిరుద్యోగుల విజ్ఞప్తి దృష్ట్యా వారికి అనుకూలంగా ఉండేలా పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేస్తూ ఏపీపీఎస్సీ ఛైర్ పర్సన్ అనురాధ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఏపీపీఎస్సీ చైర్ పర్సన్​గా బాధ్యతలు చేపట్టిన అనురాధ పెండింగ్​లో ఉన్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై చర్చించి, జనవరి 5న నిర్వహంచాలని నిర్ణయించారు. ఈ మేరకు అక్టోబర్ 30న ఆదేశాలు జారీ చేశారు. డీఎస్సీ పరీక్షలకు అడ్డు రాకుండా అప్పట్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

సాధారణంగా పరీక్ష తేదీ నిర్ణయించిన సమయం నుంచి పరీక్ష నిర్వహించే తేదీ వరకు కనీసం 90 రోజుల పాటు గడువు ఉండాల్సి ఉండగా కేవలం 60 రోజులు మాత్రమే సమయం ఇవ్వడంతో గ్రూప్-2 మెయిన్స్​కు సిద్దమయ్యే అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. సిలబస్​లో మార్పులు చేయడం వల్ల తక్కువ సమయంలో ప్రిపేర్ కాలేమని మెయిన్స్ పరీక్ష తేదీని మార్చాలని ఏపీపీఎస్సీ చైర్ పర్సన్ అనురాధను కలసి విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు సైతం ఇటీవల ఏపీపీఎస్సీ ఛైర్ పర్సన్ అనురాధను కలసి గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను మరో 30 రోజులు వాయిదా వేసి నిర్వహించాలని కోరడం తో పరీక్షను వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gcb bank limited. 2 meses atrás. The benefits of using a vpn solution for businesses.