Raghu Rama Raju as AP Deput

ఏపీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు

ఏపీ కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ను నియమించింది. మంగళవారం జరిగిన ఎన్డీఏ లేజిస్లేటివ్ సమావేశంలో కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిప్యూటీ స్పీకర్ తోపాటు.. ఉభయ సభల్లో చీఫ్ విప్, విప్ ల నియామకం గురించి చర్చించిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం అసెంబ్లీ, మండలికి చీఫ్ విప్, విప్ లను ప్రకటించి ఆ వెంటనే డిప్యూటీ స్పీకర్ ను ప్రకటించింది.

ఏపీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు ను అధికార కూటమి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. అలాగే అసెంబ్లీలో ఒక చీఫ్ విప్, 15 మంది విప్‌లు ఉండనున్నారు. శాసనసభలో చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులుకు మండలిలో చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు.

అసెంబ్లీ చీఫ్‌ విప్‌గా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

  • శాసనమండలిలో చీఫ్‌ విప్‌గా పంచుమర్తి అనురాధ
  • మండలిలో విప్‌లుగా చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్‌
  • జనసేన నుంచి మండలి విప్‌గా పి.హరిప్రసాద్‌
  • శాసనసభలో విప్‌లుగా అశోక్‌ బెందాలం, బోండా ఉమ
  • దాట్ల సుబ్బారావు, యనమల దివ్య, థామస్‌
  • జగదీశ్వరి, కాల్వ శ్రీనివాసులు, మాధవి, గణబాబు
  • విప్‌లుగా తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్రావు
  • బీజేపీ-ఆదినారాయణరెడ్డి, జనసేన-బొమ్మిడి నాయకర్
  • జనసేన నుంచి అరవ శ్రీధర్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌

రఘురామకృష్ణరాజు విషయానికి వస్తే..

2014 లోక్‌సభ ఎన్నికలకు వైసీపీ పార్టీ నామినేషన్‌ను దక్కించుకోలేక 2014 లో పార్టీ నుంచి తప్పుకుని భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో చేరారు. 2018 లో బిజెపిని విడిచిపెట్టి, తెలుగు దేశం పార్టీ (టిడిపి) లో చేరారు. అనంతరం 2019 మార్చిలో వైసీపీ తిరిగి చేరారు. ఆయన 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థిగా పోటీ చేశారు. టిడిపికి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు కంటే 31,909 ఓట్ల తేడాతో 38.11% ఓట్లు సాధించి ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఆ తర్వాత వైసీపీ కి రెబెల్ గా మారారు. 2024 ఎన్నికల ముందు టిడిపి లో చేరి ఉండి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పీ.వీ.ఎల్. నరసింహరాజుపై 56,421 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Discover unique and captivating prints. Warum diese projekte wichtig sind jedes uneedpi projekt trägt dazu bei, das potenzial des pi network zu entfalten. Jim jordan leaves the door open for special counsel jack smith to testify before congress.