గత వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకొని రెచ్చిపోయిన వారు ..ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..వైసీపీ అధికారంలో ఉన్న టైములో టిడిపి , జనసేన నేతలపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం , అసభ్యకరమైన పోస్టులు పెట్టడం , ట్రోలింగ్ చేయడం వంటివి చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తుంది. ఇప్పటికే వైసీపీ నేతలను , వైసీపీ సోషల్ మీడియా టీం ను ఇలా చాలామందిని అరెస్ట్ చేయగా..దర్శకుడు వర్మను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఆయనపై వరుస కేసులు నమోదు అవ్వడమే.
రాంగోపాల్ వర్మపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టారని..టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. వర్మపై తగిన చర్యలు తీసుకోవాలంటూ పెదపరిమి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు నూతలపాటి రామారావు తుళ్లూరు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు.
అటు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో రాంగోపాల్ వర్మపై సోమవారం కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వర్మ పోస్టు చేశారంటూ.. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. ఇలా వరుస కేసులు నమోదు అవుతుండడం తో వర్మ బయటకు రావడం కష్టమే అని అంత మాట్లాడుకుంటున్నారు.