బస్సు నడుపుతుండగా.. డ్రైవర్‌కు గుండెపోటు..ప్రయాణికులను కాపాడిన కండక్టర్

bus driver heart attack

ఇటీవల గుండెపోటు అనేది వయసు సంబంధం లేకుండా వస్తున్నాయి. అప్పటి వరకు సంతోషం తన పని తాను చేసుకుంటుండగా..సడెన్ గా కుప్పకూలి మరణిస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తుల వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోతూ కనిపించారు. మరొక వీడియోలో చేతిలో పూలు పట్టుకొని కనిపిస్తున్న పెళ్లి కూతురు ఉన్నట్లుండి నేలపై పడిపోయారు.
మరొక వీడియోలో స్నేహితులతో కలిసి నడుస్తున్న ఓ వ్యక్తి నేలపై కుప్పకూలి మరణించారు. ఈ వీడియోల నడుమ ట్విటర్‌లో #heartattack పేరుతో ఒక హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యింది.

తాజగా బస్సు నడుపుతున్న డ్రైవర్ కు గుండెపోటు రావడంతో అలాగే కుప్పకూలి చనిపోయాడు. ఈ క్రమంలో ఆ డ్రైవర్ చేతిలో ఉన్న స్టీరింగ్ విడిచిపెట్టాడు. ఈ ఘటనను వెంటనే గమనించిన బస్సు కండక్టర్ అప్రమత్తమై స్టీరింగ్ పట్టుకుని బస్సును పక్కకి తీసుకెళ్లాడు. కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. కండక్టర్ వెంటనే జాగ్రత్త పడకపోతే ఆ బస్సులోని ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ ఘటన బెంగళూరులోజరిగింది.

BMTCకి చెందిన బస్సు నేలమంగళ నుంచి దశనపురాకు వెళ్తోంది. మార్గమధ్యంలో డ్రైవర్ కిరణ్ కుమార్ గుండెపోటుతో సీట్లోనే చనిపోయారు. వెంటనే స్పందించిన కండక్టర్ ఓబటేశ్, కిరణ్‌ను పక్కకి లాగి బ్రేక్ తొక్కి బస్సు ఆపేశారు. దీంతో బస్సులోని ప్రయాణికులకు, రోడ్డుపై వెళ్తున్న వారికి ప్రమాదం తప్పింది.

RTC bus going from Nelamangala to Dasanapura in #Bangalore.

Conductor Obalesh jumped onto the driver’s seat after the driver suffered a heart attack and saved everyone’s lives by controlling the bus. pic.twitter.com/mr5NseMk4w— Siddhu Manchikanti Potharaju (@SiDManchikanti) November 6, 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“all mу dесіѕіоnѕ аrе well thоught оut, wеll rеѕеаrсhеd аnd іn my оріnіоn, thе bеѕt оn bеhаlf оf our county. Hilfe in akuten krisen. Latest sport news.