హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళితబంధు రెండో విడత నిధుల పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 20 వరకు నిధులు అందకపోతే హుజూరాబాద్ నియోజకవర్గంలో తీవ్ర నిరసనలు, రణరంగం అవుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొట్లాడి, దళితుల హక్కుల కోసం పోరాడతాను అని స్పష్టం చేశారు.
కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం పైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి హుజూరాబాద్‌లోని సుమారు 20వేల కుటుంబాలను ఆదుకున్నారన్నారు. రెండో విడత దళిత బంధు డబ్బులు వారి అకౌంట్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలను ఫ్రీజ్ చేసి దళితులను దగా చేస్తున్నదని మండిపడ్డారు. దళిత బంధు నిధుల విషయంలో కాంగ్రెస్ నాయకులు.. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు తనను కావాలని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో పలుమార్లు దళిత బంధుపై ప్రభుత్వాన్ని నిలదీశానని గుర్తు చేశారు.
ఇక రైతుల పంట కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి విరుద్ధంగా, ప్రైవేట్ వ్యక్తులతో రైతులు నష్టపోయి తమ పంటలు విక్రయించేందుకు బలవంతంగా వెళ్ళిపోతున్నారని పేర్కొన్నారు. రైతుల పరిస్థితి దారుణమైందని, ప్రభుత్వంపై నమ్మకం లేకుండా ప్రైవేట్ మార్కెట్‌లో రూ. 900 నష్టం తప్పక అమ్ముతున్నారు.