ఈ బ్యూటీ ని గుర్తుపట్టారా 42 ఏళ్ళు అయినా నో పెళ్లి

anushka

సాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ కాలం ఉంటుంది. పెళ్లి, కుటుంబ బాధ్యతలతో చాలామంది హీరోయిన్లు సినిమాలకు దూరమైపోతారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం పెళ్లి వయసు వచ్చినా తాము నటనలో కొనసాగుతూనే ఉంటారు. నాలుగు పదులు దాటినా కూడా మరింత ఉత్సాహంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. పై ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ కూడా అదే కోవలో చేరుతుంది. ఈ అందాల తార వయసు 42 సంవత్సరాలు దాటినా సౌత్ ఇండస్ట్రీలో ప్రాచుర్యం పొందుతూ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. ప్రత్యేకంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. లతో పాటు పెళ్లి రూమర్లతో వార్తల్లో నిలుస్తూ ఉంటూ తన అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తోంది. ఆమె మరెవరో కాదు, మన అందాల స్వీటీ అనుష్క శెట్టి. నవంబర్ 7న ఆమె పుట్టిన రోజు. ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే అనుష్క చిన్ననాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తెలుగులో అనుష్కను పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘సూపర్’ చిత్రంతో పరిచయం చేశారు. అప్పటి నుండి అనుష్క తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పీరియాడిక్ డ్రామాలు, సస్పెన్స్ థ్రిల్లర్స్, యాక్షన్ పాత్రలు, రొమాంటిక్ కామెడీలు వంటి విభిన్న జానర్లలో తన ప్రతిభను ప్రదర్శించింది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో తన ముద్ర వేసింది. అరుంధతి లో జేజమ్మ పాత్రతో తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తరువాత ‘భాగమతి, రుద్రమదేవి, బాహుబలి వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. కొంతకాలం గ్యాప్ తీసుకున్నప్పటికీ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో గ్రేట్ కమ్‌బ్యాక్ ఇచ్చింది.

ఇటీవల అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె ఒక తెలుగు, ఒక మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న కొత్త చిత్రం ఘాటి కి సంబంధించిన అప్‌డేట్ కూడా త్వరలో రాబోతుంది, ఇది ఆమె అభిమానులకు మరో మంచి వార్త.ప్రస్తుతం అనుష్క ఒక తెలుగు, ఒక మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా, ఆమె నటిస్తున్న కొత్త చిత్రం ‘ఘాటి’ గురించి ఒక అప్డేట్ త్వరలో రాబోతోంది. ఈ వార్త ఆమె అభిమానులకు మరొక సంతోషకరమైన విశేషం కానుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 innovative business ideas you can start today. Clínica de recuperação para dependentes químicos : quando é a hora certa ?. 禁!.