marriage

ఇండస్ట్రీలో నెక్స్ట్ పెళ్లి చేసుకోబోయే లవ్ బార్డ్స్ వీళ్లే..ఇద్దరు స్టార్సే:

ఇటీవలి కాలంలో సినిమా రంగంలో ప్రముఖుల పెళ్లిళ్ల హడావిడి చాలా ఎక్కువైంది ఒకవైపు కొంతమంది సెలబ్రిటీలు తమ ప్రేమను పెళ్లిగా మలుచుకుంటుంటే, మరికొంతమంది రహస్యంగా నిశ్చితార్థం చేసుకుని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ “త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం” అని ప్రకటిస్తున్నారు. ఫ్యాన్స్ కూడా ఇది చూసి కొన్నిసార్లు చిలిపిగా స్పందిస్తూ, మొదటి పెళ్లి, రెండో పెళ్లి అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారిన పెళ్లి వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా యంగ్ హీరోలపై వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత అర్హత కలిగిన బ్యాచిలర్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ గురించి ఎప్పటి నుంచో అనుష్కతో పెళ్లి వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ, వాటికి దాదాపు ముగింపు వచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పుడేమో టాలీవుడ్ మీడియా ప్రభాస్ తన బంధువైన డాక్టర్‌ను వివాహం చేసుకోబోతున్నాడని చెప్పుకొస్తోంది. త్వరలోనే భీమవరంలో నిశ్చితార్థం జరగబోతుందని అతని కుటుంబ సభ్యుల ద్వారా వార్తలు అందుతున్నాయి.

ఇప్పటికే ఇండస్ట్రీలో మరొక యంగ్ హీరో కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. తన తొలి సినిమాలో నటించిన హీరోయిన్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇంతలో కిరణ్ అబ్బవరం – రహస్య గోరఖ్ మొదటి సినిమాలో నటించి, ఆ తర్వాత ప్రేమలో పడి, పెళ్లి చేసుకోవడం వంటి వార్తలు కూడా ఆసక్తికరంగా మారాయి. ఫ్యాన్స్ మాత్రం “ఇంకా కెరీర్‌లో స్థిరపడక ముందే ఈ యంగ్ హీరో పెళ్లి చేసుకోవడం ఏమిటి?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు యంగ్ హీరో కూడా తను ఇంకా అంతగా స్థిరపడకుండానే వివాహానికి సిద్ధమవ్వడం కొంత మందికి ఆశ్చర్యకరం. కానీ, మరోవైపు యంగ్ హీరోయిన్ మాత్రం వరుసగా సినిమాల్లో నటిస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా ఒక చిత్రంలో నటించి పెద్ద విజయాన్ని అందుకున్న ఈ హీరోయిన్ కెరీర్‌పై ఫోకస్ చేస్తుండగా, ఆమె సహా నటుడు మాత్రం త్వరలోనే వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Com – jakarta | hadiri pelantikan pemuda katolik pengurus pusat, wakil presiden ri gibran rakabuming raka menyampaikan. But іѕ іt juѕt an асt ?. Lanka premier league archives | swiftsportx.