Aishwarya Rai:భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

aishwarya rai

ప్రపంచంలో అత్యంత అందమైన మహిళగా గుర్తింపు పొందిన ఐశ్వర్య రాయ్, తన అందం, అభినయంతో భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకుంది. అనేక సూపర్ హిట్ చిత్రాల ద్వారా ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్న ఆమె పుట్టినరోజు నవంబర్ 1. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం 51 ఏళ్ల వయసులో కూడా ఆమె తన అందంతో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. తమిళంలో అద్భుతమైన చిత్రాలతో సౌత్ ప్రేక్షకుల మదిలో నిలిచిన ఐశ్వర్య, 1997లో “ఔర్ ప్యార్ హో గయా” చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, చాలా తక్కువ కాలంలోనే అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది.

27 సంవత్సరాలుగా సినీ రంగంలో కొనసాగుతున్న ఐశ్వర్య, వివిధ దేశాల్లో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. కొన్నాళ్లుగా సినిమాల్లో కనపడకపోయినా, ఆమె సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే పలు సినిమా వేడుకలు, బాలీవుడ్ ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ ఉంటుంది. సినిమాల్లో కనిపించకపోయినా, ఐశ్వర్య వాణిజ్య ప్రకటనల ద్వారా వందల కోట్ల ఆదాయం సంపాదిస్తోంది. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరైన ఐశ్వర్య రాయ్, ఏడాదికి రూ.1 కోటికి పైగా సంపాదిస్తుంది తాజా నివేదికల ప్రకారం, ఐశ్వర్య తన చిత్రం కోసం రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటుంది. అలాగే అనేక బ్రాండ్లకు ఆమె అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. రోజుకు దాదాపు రూ.6-7 కోట్లు సంపాదించే ఐశ్వర్య పలు కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెట్టింది. 2021లో పోషకాహార సేవల కంపెనీలో రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టిన ఆమె, ఇప్పటికే బెంగళూరులోని ఎన్విరాన్‌మెంటల్ స్టార్టప్‌లో కూడా పెట్టుబడి పెట్టింది ఇదిలా ఉండగా, ఇటీవల ఐశ్వర్య వ్యక్తిగత జీవితంపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఐశ్వర్య తన భర్త అభిషేక్ బచ్చన్‌తో విడాకులు తీసుకుంటున్నారని, ఆమె కూతురు ఆరాధ్యతో ఒంటరిగా జీవిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

It’s just that mоѕt оf the gаіnѕ frоm thаt hаvе gone tо thе top. Latest sport news. ??.