హీరోలపై సోనూ సూద్ సంచలన కామెంట్స్

హీరోలపై సోనూ సూద్ సంచలన కామెంట్స్

బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించాడు.విలన్‌గా అయితే మరింత పేరు తెచ్చుకున్నాడు.ఇక కోవిడ్ సమయంలో ప్రజలకు చేసిన సేవలతో రియల్ హీరోగా నిలిచాడు.ఇప్పుడు ఆయన నటుడిగా మాత్రమే కాదు,దర్శకుడిగానూ తన ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యాడు.సోనూ సూద్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫతే’ జనవరి 10న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సోనూ సూద్ బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోను తన నటనతో మెప్పించాడు. సినిమాల్లో నటించడమే కాకుండా,పరిశ్రమల తీరు, నడత గురించి బాగా తెలుసు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుల పని తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కొంతమంది బాలీవుడ్ స్టార్‌లు ఉదయమే షూటింగ్ షెడ్యూల్‌ ఉన్నా, మధ్యాహ్నం 3 గంటలకు మాత్రమే సెట్లోకి వస్తారు.దీనివల్ల ఇతర నటీనటులు,సాంకేతిక బృందం మొత్తం వేచి చూడాల్సి వస్తుంది.ఈ ఆలస్యం కారణంగా నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు.

అలాగే విదేశాల్లో షూటింగ్‌కి వెళ్లినప్పుడు అవసరమైన స్టాఫ్ కంటే అధికంగా 150-200 మందిని తీసుకెళ్తారు.దీనివల్ల సినిమా బడ్జెట్‌ ఊహించని విధంగా పెరిగిపోతుంది’అని సోనూ సూద్ ఆవేదన వ్యక్తం చేశాడు.ఫతే’సినిమాను ఆయన చాలా సమర్థంగా తీర్చిదిద్దాడు.లండన్‌లో జరిగిన ఈ చిత్ర షూటింగ్‌లో సోనూ సూద్ కేవలం 12 మందితో కూడిన స్థానిక బృందంతోనే పని పూర్తి చేశారు.‘సాన్‌ఫ్రాన్సిస్కో గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జ్‌పై షూట్ చేయడానికి అనుమతి పొందడం చాలా కష్టం. కానీ, వారు 12 మందికే అనుమతి ఇచ్చారు.ఆ సీన్ మొత్తం చిన్న బృందంతోనే తీశాం.దుబాయ్‌లో అయితే నాకు తోడు కేవలం ఆరుగురే.

తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించినా,అది తెరపై grand గా కనిపించాలి’అని చెప్పారు.ఈ సినిమాను జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మించాయి. విజయ్ రాజ్, నసీరుద్దీన్ షా, దివ్యేందు భట్టాచార్య వంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. సైబర్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.

Related Posts
తొక్కిసలాట దురదృష్టకర ఘటన: అల్లు అర్జున్
allu arjun press meet

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఒక దురదృష్టకర ప్రమాదమని ప్రముఖ హీరో అల్లు అర్జున్ అన్నారు. ఈ విషాద ఘటనలో కొన్ని కుటుంబాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. Read more

ప్రేమ పెళ్లిపై నిర్ణయాలు మారాయి బాలీవుడ్ హీరో.
vivek oberoi

వివేక్ ఒబెరాయ్ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.బాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎన్నో విజయవంతమైన సినిమాలు అందించిన ఆయన, రక్త చరిత్ర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు Read more

సీఎం రేవంత్ రెడ్డిని చిరంజీవి విమర్శించారా?
chiranjeevi

ఇప్పుడు టాలీవుడ్‌లో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా చాలా హైప్‌ అందుకుంది.2024 డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకుల నుండి మంచి స్పందన Read more

RRR బిహైండ్ అండ్ బియాండ్ రివ్యూ
RRR బిహైండ్ అండ్ బియాండ్ రివ్యూ

జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నటించిన ఎస్.ఎస్. రాజమౌళి యొక్క అద్భుతమైన చిత్రం RRR యొక్క మేకింగ్‌ దృశ్యపరంగా ఆకర్షణీయమైన, కానీ కొంత సాధారణమైన డాక్యుమెంటరీగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *