ఖేల్ రత్న అవార్డు, అధికారికంగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనే పేరుతో ప్రాచుర్యం పొందింది, ఇది భారతదేశ అత్యున్నత క్రీడా గౌరవ పురస్కారం. ఇది 1991–1992లో ప్రారంభించబడింది, క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనలను గుర్తించడానికి. ఈ ప్రతిష్టాత్మక అవార్డు యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రతి ఏడాది ప్రదానం చేయబడుతుంది. తమ రంగాలలో అపూర్వ నైపుణ్యం, అంకితభావం మరియు ప్రావీణ్యం చూపిన క్రీడాకారులను గౌరవించడమే ఈ అవార్డు ప్రధాన లక్ష్యం.
భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం నలుగురి క్రీడాకారులకు ఖేల్‌రత్న అవార్డులు ఇవ్వనుంది. నలుగురి క్రీడాకారులకు ఖేల్‌రత్న అవార్డులు పొందవచ్చు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ విజేత గుకేష్‌కు, షూటింగ్‌లో ఒలింపిక్స్ పతక విజేత మనుబాకర్‌కు, హాకీ క్రీడాకారుడు హర్మన్‌ప్రీత్‌సింగ్‌కు, పారా ఒలింపిక్స్ స్వర్ణ పతాకం విజేత ప్రవీణ్ కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డులు వరించింది.

32 మందికి అర్జున అవార్డులు
17 మంది పారా అథ్లెట్లు సహా 32 మందికి అర్జున అవార్డులు, ఐదుగురికి ద్రోణాచార్య అవార్డులు దక్కాయి. ఈ నెల 17న ఖేల్‌రత్న అవార్డులను రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు. నలుగురి క్రీడాకారులకు ఖేల్‌రత్న అవార్డులు అందిస్తారు. ఈ సందర్భంగా ఈ నలుగురు కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఖేల్ రత్న అవార్డు విజేతలు
- శ్రీ గుకేశ్ డి – చెస్
- శ్రీ హర్మన్‌ప్రీత్ సింగ్ – హాకీ
- శ్రీ ప్రవీణ్ కుమార్ – పారా-అథ్లెటిక్స్
- శ్రీమతి మనూ భాకర్ – షూటింగ్
అర్జున అవార్డు విజేతలు
- జ్యోతి యార్రాజి – అథ్లెటిక్స్
- అన్ను రాణి – అథ్లెటిక్స్
- నీతూ ఘంగాస్ – బాక్సింగ్
- సావీటి బూరా – బాక్సింగ్
- వంతిక అగర్వాల్ – చెస్
- సలీమా టెటే – హాకీ
- అభిషేక్ – హాకీ
- సంజయ్ – హాకీ
- జర్మన్‌ప్రీత్ సింగ్ – హాకీ
- సుఖ్జీత్ సింగ్ – హాకీ
- రాకేష్ కుమార్ – పారా-ఆర్చరీ
- ప్రీతి పాల్ – పారా-అథ్లెటిక్స్
- జీవంజీ దీప్తి – పారా-అథ్లెటిక్స్
- అజిత్ సింగ్ – పారా-అథ్లెటిక్స్
- సచిన్ సర్జెరావ్ ఖిలారీ – పారా-అథ్లెటిక్స్
- ధరంబీర్ – పారా-అథ్లెటిక్స్
- ప్రణవ్ సూర్మా – పారా-అథ్లెటిక్స్
- హెచ్ హోకాటో సెమా – పారా-అథ్లెటిక్స్
- సిమ్రన్ – పారా-అథ్లెటిక్స్
- నవదీప్ సింగ్ – పారా-అథ్లెటిక్స్
- నితేష్ కుమార్ – పారా-బాడ్మింటన్
- తులసిమతి మురుగేసన్ – పారా-బాడ్మింటన్
- నిత్య శ్రీ సుమతి శివన్ – పారా-బాడ్మింటన్
- మనీషా రామదాస్ – పారా-బాడ్మింటన్
- కపిల్ పరమార్ – పారా-జూడో
- మోనా అగర్వాల్ – పారా-షూటింగ్
- రుబినా ఫ్రాన్సిస్ – పారా-షూటింగ్
- స్వప్నిల్ కుసలే – షూటింగ్
- సరబ్‌జోత్ సింగ్ – షూటింగ్
- అభయ్ సింగ్ – స్క్వాష్
- సజన్ ప్రకాశ్ – ఈత
- అమన్ సేహ్రావత్ – రెజ్లింగ్