deeksha diwas on 29th

రాష్ట్ర‌ వ్యాప్తంగా 29న దీక్షా దివస్ – బిఆర్ఎస్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర‌ వ్యాప్తంగా నవంబర్ 29 న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షాదివాస్ ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీక్షా దివస్ అనేది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు.

2009, నవంబరు 29న నిరాహార దీక్ష మొదలుపెట్టిన కేసిఆర్, డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తరువాత తన 11 రోజుల దీక్షను విరమించాడు. నవంబరు 29న కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్ధిపేట దగ్గర రంగధాంపల్లిలో ఏర్పాటుచేసిన దీక్షా స్థలం వద్దకి బయల్దేరిన కేసీఆర్ వాహనంను కరీంనగర్ మానేరు బ్రిడ్జ్ సమీపంలోని అలుగునూరు చౌరస్తాలో పోలీసు బలగాలు, రిజర్వ్ పోలీస్ బెటాలియన్లు చుట్టుముట్టారు. వాహనం నుంచి బలవంతంగా దించివేయబడ్డ కేసిఆర్, రోడ్డుమీదే ధర్నా చేస్తుండడంతో ఖమ్మం జైలుకు తరలించారు. ఆ జైలులోనే తన దీక్షను ప్రారంభించాడు.

కాగా తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్షా దివస్ నిలిచింది. ఈ దీక్షా యావత్ భారతదేశ రాజకీయ వ్యవస్థను కదిలించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటించేలా చేసింది. దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చింది. అందుకే నవంబర్ 29 న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షాదివాస్ ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.తాను కరీంనగర్‌లో జరిగే దీక్షా దివస్‌లో పాల్గొంటానని వెల్లడించారు.

✳️ ఈనెల 29వ తేదీన కరీంనగర్‌లో జరిగే దీక్ష దివస్ కార్యక్రమంలో పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS

🔹 రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివస్‌ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

🔹 తెలంగాణ ప్రజల… pic.twitter.com/8nGzqsQ3wE— BRS Party (@BRSparty) November 21, 2024

Related Posts
ఎన్‌హెచ్‌ఆర్‌సి ఛైర్మన్‌గా జస్టిస్ రామసుబ్రమణియన్
Justice Ramasubramanian as NHRC Chairman

న్యూఢిల్లీ: జాతీయ మానవహక్కుల కమిషన్‌ (NHRC) నూతన ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు రిటైర్జ్ జడ్జి వి. రామసుబ్రమణియన్‌ నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఎన్‌హెచ్‌ఆర్‌సి Read more

Chandrababu: పారిశుద్ధ్య కార్మికుల‌తో చంద్ర‌బాబు సమావేశం
Chandrababu: తణుకులో సీఎం చంద్రబాబు పర్యటన: కార్మికుల కోసం కొత్త ప్రణాళికలు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. ముఖ్యంగా పారిశుద్ధ్య Read more

Smita Sabharwal : రూ.61 లక్షల వెహికల్ అలవెన్స్.. స్మితకు నోటీసులు?
smitha

సీనియర్ IAS అధికారి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) వెహికల్ అలవెన్స్ (Vehicle allowance) కోసం జయశంకర్ వర్సిటీ (Jayashankar University) నుంచి భారీగా నిధులు తీసుకున్న Read more

ఫిబ్రవరి 4వ తేదీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం !
CM Revanth Reddy's key decision on February 4!

ఏటా ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజికన్యాయ దినోత్సవం హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన “తెలంగాణ సామాజిక న్యాయ Read more