మోగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

అందరూ ఎదురుచూస్తున్నట్లుగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ను విడుదల చేసింది. ఢిల్లీ అంతటా ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23తో ప్రస్తుత అసెంబ్లీ గడవు ముగుస్తుండటంతో ఆలోపే నూతన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది.

Advertisements


ఈవీఎంల ట్యాంపరింగ్‌ ఆరోపణలు ఖండించిన సీఈసీ
ఈవీఎంల ట్యాంపరింగ్‌ ఆరోపణలు సీఈసీ రాజీవ్‌కుమార్‌ ఖండించారు. ఈవీఎంలతోనే ఫలితాలు పారదర్శకంగా ఉంటాయని, ఈవీఎంల రిగ్గింగ్‌ జరిగినట్లు ఇంతవరకు ఎక్కడా నిరూపణ కాలేదని ఆయన తెలిపారు. ఈవీఎంల రిగ్గింగ్‌ సాధ్యం కాదని చెప్పారు. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా ఇదే తనకు చివరి ప్రెస్‌ మీట్‌ అని సీఈసీ చెప్పారు. ఓటింగ్‌ శాతంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంపై కూడా సీఈసీ స్పందించారు. పోలింగ్‌ రోజు సాయంత్రం 6 గంటలకు కచ్చితమైన పోలింగ్‌ శాతం వెల్లడించడం సాధ్యం కాదని అన్నారు.
జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల
ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నట్లు పేర్కొంది. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. జనవరి 17 వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. జనవరి 20 వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. షెడ్యూల్‌ విడుదల సందర్భంగా చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఈవీఎంలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంపై క్లారిటీ ఇచ్చారు. ఓటర్‌ లిస్ట్‌ ట్యాంపరింగ్‌ జరిగిందన్న ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది.

Related Posts
Nirmala Sitharaman: ఆలయ ప్రసాదాల పై జీఎస్టీ మినహాయింపు: నిర్మలా సీతారామన్

ఆలయ ప్రసాదాలకు జీఎస్టీ మినహాయింపు: నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన పార్లమెంటులో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆలయ ప్రసాదాలకు జీఎస్టీ Read more

కాంగ్రెస్‌ మరోసారి నవ్వులపాలైంది – కిషన్ రెడ్డి
kishan reddy warning

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి..మరోసారి నవ్వులపాలైందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి 251 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ ను Read more

ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అండర్ వరల్డ్ డాన్
ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అండర్ వరల్డ్ డాన్

ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం సన్నిహితుడిగా ఉన్న ఛోటా రాజన్, 2001లో హోటల్ యజమాని జయ శెట్టి హత్య కేసుకు సంబంధించి 2024లో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే, Read more

కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
Encounter in Kupwara. Terrorist killed

శ్రీనగర్‌: మరోసారి జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలు తాజాగా మరో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఘటనా స్థలం Read more

×