Cabinet meeting concludes.. Approval of several key issues

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా అసెంబ్లీ భవనం నిర్మాణానికి రూ.617 కోట్లు, హైకోర్టు భవన నిర్మాణానికి రూ.786 కోట్లు కేటాయిస్తూ ముందడుగు వేసింది. ఈ నిర్మాణ పనులను టెండర్లలో తక్కువ ధరను కోట్ చేసిన ఎల్‌1 బిడ్డర్‌కు అప్పగించనుంది.

Advertisements

“స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్” అనే ప్రత్యేక వ్యవస్థ

పర్యావరణానికి అనుకూలంగా, వరదల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో “స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్” అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు, రాష్ట్రంలో పునరుత్పత్తి శక్తి అభివృద్ధికి కూడా ప్రాధాన్యతనిస్తూ వివిధ ప్రాంతాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. బలిమెల మరియు జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద 30 మెగావాట్ల సామర్థ్యంతో రెండు హైడల్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఒడిశా పవర్ కన్సార్టియమ్ ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

AP Cabinet Meeting V jpg 442x260 4g

విశాఖపట్నం ఐటీ హిల్-3లో టీసీఎస్‌కు 21.66 ఎకరాల భూమి

ఐటీ రంగాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, విశాఖపట్నం ఐటీ హిల్-3లో టీసీఎస్‌కు 21.66 ఎకరాల భూమిని కేటాయించింది. అలాగే ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయిస్తూ కీలక ఆమోదం ఇచ్చింది. అయితే ఈ కేబినెట్ భేటీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకాకపోవడం గమనార్హం. ఆయన కూర్చునే స్థానం ఖాళీగా ఉండటం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. మొత్తంగా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే కీలక నిర్ణయాలతో ఈ కేబినెట్ సమావేశం ముగిసింది.

Related Posts
పోసాని రిమాండ్ రిపోర్టులో ఏముందంటే !
పోసానిపై పలు స్టేషన్లలో 30 కి పైగా ఫిర్యాదులు

పోసాని రిమాండ్ రిపోర్టు సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును Read more

Sunita Williams: నింగిలోకి ఫాల్కన్‌ 9 రాకెట్‌.. త్వరలోనే భూమ్మీదకు సునీతా విలియమ్స్!
Falcon 9 rocket lifts off into space.. Sunita Williams to return to Earth soon!

Sunita Williams: అంతరిక్షకేంద్రంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ త్వరలోనే భూమ్మీద కాలుమోపే దిశగా అడుగులు పడ్డాయి. నాసా-స్పేస్‌ ఎక్స్‌లు తాజాగా క్రూ-10 మిషన్‌ను Read more

Gas Cylinder: వినియోగదారులకు షాక్..భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల రేట్లు
వినియోగదారులకు షాక్..భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల రేట్లు

కేంద్ర ప్రభుత్వం గృహావసరాల వంటగ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తాజాగా గ్యాస్ సిలిండర్ల ధరను భారీగా పెంచినట్టు ప్రకటించింది. ఒక్కో Read more

Vijayashanti : ఎమ్మెల్సీ విజయశాంతి భర్తకు బెదిరింపులు
Threats to MLC Vijayashanti husband

Vijayashanti : డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేంతవరకు అతి దారుణంగా చంపేస్తానంటూ ఎమ్మెల్సీ విజయశాంతి భర్తను ఓ వ్యక్తి బెదిరించాడు. దాంతో అతడిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×