modi

మన్మోహన్ సింగ్ మృతిపై మోదీ సందేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపై ఒక వీడియో సందేశాన్ని దేశప్రజలకు విడుదల చేసారు. ఈ ఉదయం మోదీ ఆయన నివాసానికి వెళ్లారు. పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళి అర్పించారు.
ప్రఖ్యాత ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఓ ఎంపీగా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించేవారని మోదీ చెప్పారు. వీల్‌చైర్‌పై పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారని గుర్తు చేశారు.
దేశానికి తీరని లోటు
తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా పని చేశారని, ఆ సమయంలో పలు జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక అంశాలపై ఆయనతో తరచూ చర్చించేవాడనని మోదీ చెప్పారు. ఓ రాజనీతిజ్ఞుడిగా రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహించే వారని, ప్రతి ఒక్కరికీ అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉండేవారని అన్నారు. మన్మోహన్ సింగ్ మృతి ఈ దేశానికి తీరని లోటును మిగిల్చిందని మోదీ పేర్కొన్నారు. సంక్షోభ సమయాలను ధీటుగా ఎదుర్కొని, ఎలా అత్యున్నత శిఖరాలకు చేరవచ్చనే విషయాన్ని మన్మోహన్ సింగ్ జీవితాన్ని చూసి నేర్చుకోవచ్చని, ఈ తరానికి ఆయన ఓ ఆదర్శనీయుడని నివాళి అర్పించారు.

Advertisements
Related Posts
ఇండోర్ కు సీఎం రేవంత్
revanth

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్లనున్నారు. అంబేడ్కర్ స్వగ్రామం మహూ కంటోన్మెంట్లో నిర్వహించనున్న 'సంవిధాన్ బచావో' ర్యాలీలో సీఎం రేవంత్ పాల్గొనబోతున్నారు. ఈ Read more

Mamata Banerjee : నేను బతికున్నంత కాలం టీచర్ల ఉద్యోగాలు కాపాడతా : మమతా బెనర్జీ
I will protect teachers' jobs as long as I live.. Mamata Banerjee

Mamata Banerjee : ఇటీవల సుప్రీంకోర్టు పశ్చిమబెంగాల్‌లో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న 25,753 మంది టీచర్లు , ఇతర సిబ్బంది నియామకం చెల్లుబాటు కాదంటూ సంచలన Read more

బ్యాంకులకు ఆదివారం సెలవు లేదు: ఆర్బీఐ
బ్యాంకులకు ఆదివారం సెలవు లేదు: ఆర్బీఐ

ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 31 మార్చి 2024న బ్రాంచులు తెరిచి ఉండేలా చూసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కోరింది. Read more

పుష్ప 2: అదనపు 20 నిమిషాల ఫుటేజీతో రీలోడ్
పుష్ప 2: అదనపు 20 నిమిషాల ఫుటేజీతో రీలోడ్

టాలీవుడ్‌లోని అతిపెద్ద బ్లాక్‌బస్టర్ పుష్ప 2: ది రూల్ ఇప్పుడు ప్రేక్షకులకు మరింత ఆసక్తికరమైన అనుభూతిని అందించబోతోంది. ఈ చిత్రానికి మరో 20 నిమిషాల అదనపు ఫుటేజీ Read more

Advertisements
×