manipur

మణిపూర్ లో రాజకీయనేతల ఇళ్లపై.. నిరసనకారులు దాడి

మణిపూర్ రాష్ట్రం మరోసారి హింసాత్మక ఘటనలతో వణికిపోతుంది. కుకీ, మైతీ వర్గాల మధ్య విభేదాలు మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి. జిరిబామ్ జిల్లాలో కుకీలు కిడ్నాప్ చేసిన మైతీ వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తుల మృతదేహాలు శనివారం లభ్యమవడం రాష్ట్రంలో తీవ్ర అలజడికి కారణమైంది. ఈ హత్యల నేపథ్యంలో జిరిబామ్ జిల్లాలో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు మొదలుపెట్టారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేశారు.

గతవారం జిరిబామ్‌లోని బోకోబెరాలో కుకీ మిలిటెంట్లు దాడి చేశారు. కొందరు మహిళలు, పిల్లలను కిడ్నాప్ చేశారు. ఈ సందర్భంగా భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది కుకీ మిలిటెంట్లు మరణించారు.కిడ్నాపైన ఒకే కుటుంబానికి చెందిన మహిళలు, పిల్లలతో సహా ఆరుగురిని కుకీ మిలిటెంట్లు దారుణంగా హత్య చేశారు. ముగ్గురి మృతదేహాలు శుక్రవారం రాత్రి నదీ సమీపంలో కనిపించాయి. మృతుల్లో ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నారు. దీంతో మైతీ వర్గానికి చెందిన ప్రజలు రాజధాని ఇంఫాల్‌లో శనివారం భారీ నిరసన చేపట్టారు. తమ వర్గం హత్యలపై న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేశారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్ నివాసంపై ఒక గుంపు దాడి చేసింది.

మరోవైపు పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని సగోల్‌బండ్ ప్రాంతంలో సీఎం ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్‌కే ఇమో నివాసం ముందు ఆందోళనకారులు గుమిగూడి నిరసన తెలిపారు. హత్యలపై ప్రభుత్వం స్పందించాలని, నిందితులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే కైషామ్‌థాంగ్ నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే సపం నిషికాంత సింగ్‌ను కలిసేందుకు ఆయన నివాసానికి నిరసనకారులు చేరుకున్నారు.

Related Posts
నవంబర్ 26న పార్లమెంట్ ఉభయసభల ప్రత్యేక సమావేశం
A special meeting of both houses of Parliament on November 26

న్యూఢిల్లీ: నవంబర్‌ 26న పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక సమావేశానికి సిద్ధమవుతున్నాయి. రాజ్యాంగానికి ఆమోదం ఇచ్చిన సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో నవంబర్ 26న ఈ Read more

కొనసాగుతున్న టెక్ ఉద్యోగుల తొలగింపు
tech employees

ప్రముఖ గ్లోబల్ CRM సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ అయిన సేల్స్‌ఫోర్స్ భారీ తొలగింపు ప్లాన్స్ ప్రకటించింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇంకా గూగుల్ ఈ ఏడాది 2025లో ఉద్యోగుల తొలగింపులను Read more

మన్మోహన్-నరసింహారావు గౌరవంపై వివాదం
మన్మోహన్-నరసింహారావు గౌరవంపై వివాదం

భారతీయ జనతా పార్టీ (బిజెపి) మరియు కాంగ్రెస్ మధ్య ప్రస్తుతం ఒక పెద్ద గౌరవ వివాదం సంభవించింది. ఈ వివాదం ప్రధానంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ Read more

ఆదాయపు పన్నుపై పరిమితి పెంచిన కేంద్రం
budget

బడ్జెట్ లో వేతన జీవులకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. మధ్యతరగతి ప్రజలకు ఆదాయపు పన్ను పరిమితిని పెంచింది. రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *