భారత క్రికెట్ జట్టులో స్థానం పొందడం ఎప్పటికీ సవాలే. దేశవ్యాప్తంగా ఉన్న అపారమైన ప్రతిభతో, జట్టులో స్థిరంగా చోటు దక్కించుకోవడం మరింత కష్టం. ఈ నేపథ్యంలో, మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ టీమ్ ఇండియాలో తన ప్రయాణం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. 2006-07 రంజీ ట్రోఫీలో 99.50 సగటుతో అద్భుత ప్రదర్శన కనబరచినప్పటికీ, గాయాల కారణంగా తివారీకి అంతర్జాతీయ అరంగేట్రం కోసం చాల సమయం పడింది. 2008లో అరంగేట్రం చేసిన తివారీ, 2011లో వెస్టిండీస్‌పై సెంచరీ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

కానీ, ఆ మ్యాచ్ తర్వాత 14 మ్యాచ్‌లకు అతనికి ప్లేయింగ్ XIలో చోటు దక్కలేదు. తివారీ మాట్లాడుతూ, “ధోనీ నాయకత్వం కలిగిన జట్టులో సెలక్షన్లు పూర్తిగా అతని ప్రణాళికల ప్రకారం జరిగేవి. నేను సెంచరీ చేసి అవార్డులు గెలుచుకున్నప్పటికీ, తదుపరి టూర్‌లో నన్ను వదిలేశారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేశ్ రైనా లాంటి ఆటగాళ్లు పెద్ద స్కోర్లు చేయకపోయినా, నాకు అవకాశం ఇవ్వలేదు,” అని చెప్పారు. తన కెరీర్‌లో ఎదురైన ఇబ్బందుల గురించి పంచుకుంటూ, తివారీ యువ క్రికెటర్లకు ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు. “ప్రతి క్రీడాకారుడికీ ఒక రోజు సమయం, అవకాశం వస్తుంది.
ఆటగాళ్లకు నమ్మకం, సెలక్షన్ విధానంలో పారదర్శకత అవసరం,” అని ఆయన అన్నారు. క్రీడా జీవితం తర్వాత, తివారీ రాజకీయ రంగంలో ప్రవేశించి, బెంగాల్‌కు నాయకత్వం వహించడమే కాకుండా, క్రీడలు-యువజన శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తివారీ మాట్లాడుతూ, “క్రికెటర్‌గా ఫిట్‌నెస్, ప్రదర్శన మాత్రమే కాదు, మానసిక శక్తి కూడా చాలా ముఖ్యం. జట్టులో చోటు దక్కించుకోవడంలో స్పష్టత లేకపోవడం ఆటగాళ్ల మనోభావాలను దెబ్బతీస్తుంది,” అని తెలిపారు. తివారీ అనుభవాలు క్రికెట్ వ్యవస్థకు మార్గదర్శకంగా నిలవాలని, జట్టులో పారదర్శకత పెంచడం, ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడం అత్యవసరం అని పేర్కొన్నారు. “కోచ్, సెలెక్టర్లు, కెప్టెన్లు ఒకదానికొకటి మద్దతుగా ఉండాలి. టీమిండియా మాజీ కెప్టెన్ మహേന്ദ്ര సింగ్ ధోనీ అత్యుత్తమ సారథి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతని హయాంలో టీమిండియా సాధించిన విజయాలే ధోనీ ఎంతటి గొప్ప కెప్టెనో తెలియజేస్తాయి.
2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ 2013 చాంపియన్స్ ట్రోఫీతో ఐసీసీ టైటిళ్లు అన్నీ గెలిచిన ఏకైక సారథిగా ధోనీ చరిత్రకెక్కాడు. అతను భారత క్రికెట్‌లో ఓ కొత్త చరిత్రను లిఖించాడు. 28 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించాడు. అతని హయాంలో ఎంతో మంది యువ ఆటగాళ్లు స్టార్ క్రికెటర్లుగా ఎదిగారు. అయితే ఓ నలుగురి ఆటగాళ్లకు మాత్రం ధోనీ కెప్టెన్సీలో తీరని అన్యాయం జరిగింది. ప్రత్యక్షంగా ధోనీ పాత్ర లేకున్నా.. అతని నిర్ణయాలు వారి కెరీర్‌కు ముగింపు పలికేలా చేశాయి. ఆ ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.