కొత్త బంగారు లోకం సినిమాకు ఆ స్టార్ హీరో ఫస్ట్ ఛాయిస్..

బ్లాక్ బస్టర్ హిట్ మిస్ అయిన హీరో ఎవరంటే..

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ నటనలో కీలకమైన మలుపు తీసుకొచ్చిన సినిమా కొత్త బంగారు లోకం.హ్యాపీ డేస్ తో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఈ హీరో, వెంటనే కొత్త బంగారు లోకం ద్వారా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు.కానీ ఆ తర్వాత వరుసగా వచ్చిన సినిమాలు ఆశించిన విజయాలు సాధించకపోవడంతో, వరుణ్ సందేశ్ కెరీర్ కాస్తా నిలకడగా సాగింది.2008లో విడుదలైన కొత్త బంగారు లోకం టాలీవుడ్‌లో ఒక అద్భుతమైన ప్రేమకథగా నిలిచింది.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్ జంటగా మెప్పించారు.

kota bangaru lokam
kota bangaru lokam

కాలేజీ, హాస్టల్ నేపథ్యంలో సాగే కథతో యూత్‌ను ఆకట్టుకునే విధంగా సన్నివేశాలను మలిచారు. సినిమాను విడుదల సమయంలో పెద్దగా అంచనాలు లేకపోయినా, ఈ చిత్రం థియేటర్లలో సంచలనం సృష్టించింది. ఈ సినిమాలోని డైలాగులు, పాటలు ఆడియన్స్‌ను బాగా ఆకర్షించాయి.ముఖ్యంగా వరుణ్ సందేశ్ మేనరిజం అప్పట్లో యూత్‌లో విపరీతమైన ఆదరణ పొందింది.మరోవైపు హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ తన ముద్దు ముద్దు నటనతో కుర్రకారును కట్టిపడేసింది.

ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారం అయితే, ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తూ ఆనందిస్తారు.ఈ సినిమాకు మొదటి ఎంపిక వరుణ్ సందేశ్ కాదు అనే విషయం ఆసక్తికరమైనది.ఈ చిత్రానికి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మొదటగా అక్కినేని నాగచైతన్యను హీరోగా ఎంచుకున్నారు.నాగచైతన్య కోసం నాగార్జునను సంప్రదించినప్పుడు, కథ బాగుంది కానీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ ఉంటే మరింత బాగుంటుందనే సూచన అందించారు.దీంతో చైతన్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత మరో హీరోను సంప్రదించినా, చివరకు ఈ అవకాశం వరుణ్ సందేశ్‌కు లభించింది.తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన కొత్త బంగారు లోకం ఊహించని విజయాన్ని అందుకుంది. యూత్‌ను ఎంతగానో అలరించిన ఈ చిత్రం అప్పటి ట్రెండ్స్‌ను సృష్టించింది. ఈ సినిమా ద్వారా వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

Related Posts
ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్
mechanic rocky

టాలీవుడ్ యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ఈ చిత్రం పేరును మెకానిక్ రాకీ Read more

సింహాన్ని మహేష్ ను లాక్ చేశానన్నరాజమౌళి
సింహాన్ని మహేష్ ను లాక్ చేశానన్నరాజమౌళి

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే పెద్ద అంచనాలు ఉన్నాయి. Read more

ఏపీలోని ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానిపై క్లారిటీ
ఏపీలోని ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానిపై క్లారిటీ

ఏపీలోని ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానిపై క్లారిటీ ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదు స్థానాల్లో ఒకదానిపై స్పష్టత వచ్చింది. జనసేన Read more

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె పూజలు
chiranjeevi 1

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన తాజా చిత్రం “విశ్వంభర” చిత్రీకరణలో బిజీగా ఉన్నారు, ఈ సినిమాను దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్నారు. మరోవైపు, ఆయన కుమారుడు రామ్ చరణ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *