AP High Court orders to restore YS Jagan passport

జగన్‌కు పాస్‌పోర్టు పునరుద్దరణకు హైకోర్టు ఆదేశాలు

అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ఐదేళ్ల కాలపరిమితతో పాస్‌పోర్టు జారీ చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. గతంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది. గత ఏడాది ఆగస్టులో జగన్మోహన్‌రెడ్డి తన కుమార్తెల పుట్టిన రోజు కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేశారు. తనకు రెగ్యులర్ పాస్‌పోర్టు ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. అంతకు ముందు ఐదేళ్ల కాలానికి పాస్‌పోర్టు ఇవ్వాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఆ ఉత్తర్వులపై ప్రజాప్రతినిధుల కోర్టు స్టే విధించింది. ఏడాది పునరుద్ధరణకే అంగీకరించింది. దీని కూడా కొన్ని షరతులు పెట్టింది. 20 వేల రూపాయల పూచీకత్తు సమర్పించాలని సూచించింది.

image
image

ఈ ఉత్తర్వులపైనే హైకోర్టు ఆశ్రయించిన జగన్‌కు కాస్త ఊరట లభించింది. ఐదేళ్ల పాటు పాస్‌పోర్టు జారీకి వీలుగా నిరంభ్యంతర పత్రం ఇవ్వాలని ఆదేశించింది. 2019 నుంచి ఐదేళ్లపాటు జగన్ మోహన్ రెడ్డికి డిప్లొమేటిక్‌ పాస్‌పోర్ట్‌ ఉండేది. 2024లో పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆ పాస్‌పోర్టు రద్దు అయిపోయింది. దీంతో ఆయన తన వ్యక్తిగత పాస్‌పోర్టు మీదనే విదేశాలకు వెళ్లాలి. సెప్టెంబర్‌లో విదేశాలకు వెళ్లాల్సిన ఆయన తన పాస్‌పోర్టు రెన్యువల్ చేయాలని రిక్వస్ట్ పెట్టుకున్నారు. ఐదేళ్లకు రెన్యువల్ చేయాలని చెప్పిన సీబీఐ కోర్టు ఆదేశాలను చూపించారు. అయితే 2018లో నమోదు అయిన పరువునష్టం దావా కేసు విషయాన్ని అధికారులు ప్రస్తావించారు. ఆ కేసులో కూడా ఎన్‌వోసీ తీసుకురావాలని సూచించారు.

2018లో విజయవాడ కోర్టులో జగన్ మోహన్ రెడ్డిపై అప్పటి మంత్రిగా ఉన్న నారాయణ పరువు నష్టం దావా వేశారు. పాస్‌పోర్టు జారీకి ఈ కేసు అడ్డంకిగా మారింది. ఈ కేసు సంగతి తనకు తెలియదన్న జగన్ కోర్టుకు వెళ్లారు. విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇది అబద్దమని పీపీ వాదించారు. ఆ కేసులో ఇచ్చిన సమన్లు అందుకోవడం లేదని, 2019, 2024లో ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్‌లో కూడా కేసు గురించి ప్రస్తావించారని తెలిపారు. ఈ కేసుపై హైకోర్టు స్టే ఇవ్వలేదని కూడా కోర్టుకు తెలియజేశారు. ఈ వాదనలతో ఏకీ భవించిన విజయవాడ కోర్టు జగన్ పిటిషన్ కొట్టేసింది. కేవలం ఒక ఏడాది మాత్రమే రెన్యువల్ చేసుకోవడానికి అంగీకరించింది. అంతేకాకుండా 20వేల పూచీకత్తు స్వయంగా హాజరై ఇవ్వాలని కూడా ఆదేశించింది.

Related Posts
ఆరవ రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
WhatsApp Image 2024 11 11 at 10.56.56

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సభ ప్రారంభంలో ప్రశ్నోత్తరాల సెషన్ జరగనుంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో Read more

హీరో కిచ్చా సుదీప్ కు మాతృవియోగం
kiccha sudeep lost his moth

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది, ఆయన తల్లి సరోజా సంజీవ్ కన్నుమూశారు. వయసుతో సంబంధించిన అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని Read more

13 నిమిషాల్లోనే డోనర్ గుండె త‌ర‌లింపు..
Donor's heart moved within 13 minutes

హైదరాబాద్‌: నగరంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు ఓ గుండెను సాధ్యమైనంత వేగంగా తరలించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. డాక్టర్లు హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించి అవసరమైన Read more

శ్రీ మందిర్ యొక్క కార్తీక మహా దీపం వేడుక
Kartika Maha Deepam celebration of Sri Mandir

ఆధ్యాత్మిక మేల్కొలుపు మరియు విముక్తి కోసం అరుణాచలేశ్వర దీపం యొక్క ప్రత్యక్ష దర్శనంతో పవిత్రమైన అరుణాచల తీర్థ శివ పార్వతీ కళ్యాణం మరియు మహా రుద్ర హోమంలో Read more