bengaluru

బెంగళూరులో పొడవైన యూ-గర్డర్ ఆవిష్కరణ!

దేశంలోనే అతిపొడవైన యూ-గర్డర్ (సిమెంట్ దూలం)ను బెంగళూరులోని సబర్బన్ రైల్ కారిడార్‌లో ఉపయోగించారు. బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా 31 మీటర్ల పొడవైన ఈ గర్డర్‌ను ఈ ఏడాది జనవరిలో గొల్లహళ్లిలో ఒకే విడతలో ప్రీకాస్ట్ చేయడం విశేషం. బైయప్పనళ్లి-చిక్కబనవర లైన్‌లో యశ్వంతపూర్‌లో గత రాత్రి 9.45-10 గంటల మధ్య ఆవిష్కరించినట్టు ‘కే-రైడ్’ (కర్ణాటక రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్) అధికారులు తెలిపారు.
యూ’ ఆకారంలో గర్డర్‌
‘యూ’ ఆకారంలో ఉన్న ఈ గర్డర్‌లను రైల్వే ఆధారిత ప్రజారవాణా ప్రాజెక్టులలో ఉపయోగిస్తుంటారు. హెబ్బాల్-యశ్వంతపూర్ మధ్య మల్లిగే లైన్ 8 కిలోమీటర్ల ఎలివేటెడ్ సెక్షన్‌లో 450 యూ-గర్డర్‌లు ఉపయోగిస్తున్నారు. గొల్లహళ్లి వద్ద ఇప్పటికే 60 యూ గర్డర్లు వేశారు. కాగా, మల్లిగే లైన్‌ను డిసెంబర్ 2026 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇవి నాణ్యంగా ఉండటంతోపాటు నిర్మాణ సమయాన్ని ఆదా చేస్తాయి. మెట్రో ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు గరిష్ఠంగా 28 మీటర్ల యూ గర్డర్లను మాత్రమే ఉపయోగించారు. యూ గర్డర్‌కు 69.5 క్యూబిక్ మీటర్ల ఎం60 గ్రేడ్ కాంక్రీట్ అవసరం అవుతుంది. బరువు ఏకంగా 178 టన్నులు ఉంటుంది.

Related Posts
PM Modi: రామేశ్వరంలో ప్రధాని మోడీ రామనవమి వేడుకలు..
PM Modi celebrates Ram Navami in Rameswaram

PM Modi: శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ తమిళనాడు రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఏప్రిల్ 06న ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇదే రోజు Read more

Revanth Reddy:అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో రేవంత్ రెడ్డి..
Revanth Reddy:అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో రేవంత్ రెడ్డి..

ఇండియా లో 2025 సంవత్సరానికి అత్యంత శక్తివంతమైన 100 మంది వ్యక్తుల జాబితా విడుదలైంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రూపొందించిన ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి Read more

జామా మసీదు పై ఒవైసీ ఆగ్రహం
జామా మసీదు పై ఒవైసీ ఆగ్రహం

సంభాల్‌లో జామా మసీదు వద్ద నిర్మాణంలో ఉన్న కొత్త పోలీస్ అవుట్‌పోస్ట్‌పై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. Read more

Vijay: డీలిమిటేషన్ పై విజయ్ పార్టీ కీలక నిర్ణయం
Vijay: డీలిమిటేషన్ పై విజయ్ పార్టీ కీలక నిర్ణయం

త్రిభాషా సూత్రం, డీలిమిటేషన్ పై తమిళ పార్టీల వ్యతిరేకత జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా సూత్రాన్ని, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)ను తమిళ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ Read more