అల్లు అర్జున్-సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప-2: ది రూల్ భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంటూ, దాదాపు 2 వేల కోట్ల వసూళ్లకు చేరువైంది. ఈ సినిమా విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పుడు ఈ చిత్రానికి అదనంగా 20 నిమిషాల కొత్త సన్నివేశాలు జోడించి, పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్‌ను థియేటర్లలో విడుదల చేశారు. ఈ రీ లోడెడ్ వెర్షన్‌కు కూడా చాలా మంచి స్పందన వస్తోంది. సినిమాను చూసేందుకు ప్రేక్షకులు హౌస్‌ఫుల్స్‌గా థియేటర్లను నింపుతున్నారు.ఈ సరికొత్త సన్నివేశాలతో పుష్ప-2 ప్రేక్షకుల హృదయాలను మరింత ఆకట్టుకుంటోంది. ఈ సన్నివేశాలు ప్రత్యేకంగా:

- షెకావత్ (ఫహాద్) మరియు పుష్పరాజ్ మధ్య సన్నివేశం – ఎర్రచందనం చెన్నై బోర్డర్‌కు తరలించిన తర్వాత మంగళం శ్రీను (సునీల్) మరియు దాక్షాయణి (అనసూయ) చెప్పే సంభాషణలు జోడించబడ్డాయి.
- జాతర సన్నివేశం – కావేరి (కావ్య) మరియు శ్రీవల్లి (రష్మిక మందన్నా) మధ్య కొన్ని కొత్త సంభాషణలు.
- షెకావత్ వద్ద ఎర్రచందనం, కమిటి రాకపోవడం – పుష్పరాజ్ తో పాటు మరో కీలక సన్నివేశం.
- పుష్పరాజ్‌తో సిండికేట్ మీటింగ్ – ఈ సన్నివేశంలో పవర్‌ఫుల్ డైలాగ్‌లు ఉన్నాయి, “పుష్పగాడు ఇది ఎర్రచొక్కా అంటే అందరూ నమ్మాలి,” అంటూ డైలాగ్.
- జపాన్ డీలర్ హామీద్ మరణం – రామేశ్వరంలో అండర్‌వాటర్ బోట్‌ల కింద ఎర్రచందనం పంపించే ముందు హామీద్ చనిపోతాడు.
- జపాన్ ఎపిసోడ్ – ఈ సన్నివేశాలు రీలోడెడ్‌లో మరింత హైలైట్ అయ్యాయి.
- జాలిరెడ్డి ఇంటికి పుష్పరాజ్ రాగా – జాలిరెడ్డితో సంభాషణ.
- క్లైమాక్స్‌లో కొత్త టచ్ – పుష్పరాజ్ చిన్నప్పుడు అజయ్ దగ్గర లాక్కున చైన్‌ను, కావేరి పెళ్లిలో అజయ్ & పుష్పరాజ్ మెడలో వేసే సన్నివేశం.ఇలాంటి కొత్త సన్నివేశాలతో పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్ ప్రేక్షకులకు మరింత మెప్పిస్తోంది. ఈ వెర్షన్ చూసిన ప్రేక్షకులకు కొన్ని కన్‌ఫ్యూజన్స్ కూడా క్లారిటీకి వచ్చాయి. పుష్ప-2 చిత్రం సరికొత్త ఎమోషనల్ ఆభివృద్ధితో మరోసారి ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది.