Minister key points on the Pune rape incident

పుణె అత్యాచార ఘటన పై మంత్రి కీలక విషయాలు

ఎదుటివారిని ఆకట్టుకునేందుకు చాలా నీట్‌గా రెడీ

పుణె: మహారాష్ట్ర మంత్రి యోగేశ్‌ కదమ్ పుణె అత్యాచార ఘటన పై స్పందించారు. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 9 గంటలకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందిన వెంటనే అర్ధగంటలో నిందితుడు ఎవరో గుర్తించాం. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతడిని ట్రాక్ చేశాం. ఘటన తర్వాత అతడు బస్సులో వెళ్లిపోయాడు. అతడు గత నాలుగైదు రోజులుగా ఏం చేశాడో తెలిసింది. దురుద్దేశంతోనే పలు బస్టాండ్‌లకు వెళ్లాడు. అప్పుడు అతడు చాలా నీట్‌గా రెడీ అయ్యాడు. ఇన్‌షర్ట్‌ చేసుకున్నాడు. ఎదుటివారిని ఆకట్టుకునేందుకు అతడు అలా ప్రవర్తించివుండొచ్చు.

పుణె అత్యాచార ఘటన పై మంత్రి

అక్క అని సంబోధిస్తూ నమ్మించాడు

కాగా.. అత్యంత రద్దీగా ఉండే బస్‌ స్టేషన్‌లలో ఒకటైన స్వర్‌గేట్‌లో మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. తన స్వగ్రామానికి వెళ్లేందుకు బస్‌స్టేషన్‌కు చేరుకున్న యువతితో నిందితుడు మాటలు కలిపాడు. అక్క అని సంబోధిస్తూ నమ్మించాడు. గ్రామానికి వెళ్లే బస్సు మరో చోట ఉందని చెప్పి బస్‌ స్టేషన్‌లోనే దూరంగా ఎవరూ లేని చోట ఆగి ఉన్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్‌ దగ్గరకు ఆమెను తీసుకెళ్లాడు.

రామదాస్‌ను పట్టుకొనేందుకు 8 ప్రత్యేక బృందాలు

బస్సులోకి వెళ్లేందుకు యువతి తటపటాయించడంతో లోపల ప్రయాణికులు ఉన్నారని.. నిద్రలో ఉండటంతో వాళ్లు లైట్లు వేసుకోలేదని నమ్మించాడు. బస్సులోకి యువతి ప్రవేశించగానే తలుపు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ రామదాస్‌ (36)గా పోలీసులు గుర్తించారు. అతడిపై అనేక కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిల్‌ మీద ఉన్నాడని తెలిపారు. రామదాస్‌ను పట్టుకొనేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అత్యాచారం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోనే పోలీస్‌ స్టేషన్‌ ఉండటం గమనార్హం.

Related Posts
మణిపూర్‌లో మళ్లీ తెరచుకున్న స్కూళ్లు, కాలేజీలు..
Schools and colleges reopened in Manipur

ఇంఫాల్‌: మణిపూర్‌లో కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్నవిషయం తెలిసిందే. అక్కడ క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రంలో భారీగా సైనికులను Read more

పవన్ క్యాంపు ఆఫీస్ పై గుర్తు తెలియని డ్రోన్..!!
unidentified drones over Pa

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ కలకలం రేపింది. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం మీద శనివారం మధ్యాహ్నం Read more

జర్నలిస్టు హత్య కేసు: హైదరాబాద్‌లో నిందితుడి అరెస్టు
జర్నలిస్టు హత్య కేసు: హైదరాబాద్‌లో నిందితుడి అరెస్టు

గత వారం ఛత్తీస్‌గఢ్‌లోని సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం లభించిన జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ హత్యకు సంబంధించి దర్యాప్తు చేస్తూ, ఈ హత్యకు కుట్ర పన్నిన ప్రధాన నిందితుడిని Read more

గుజరాత్ లో వికలాంగుల‌కు అదానీ ఫౌండేషన్ 1,152 టెక్నికల్ కిట్స్ పంపిణీ
adani foundation distributes kits with disabilities

అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం, 3 డిసెంబర్ 2024 న, గుజరాత్ ప్రభుత్వంతో కలిసి అదానీ ఫౌండేషన్ తమ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి తన సంకల్పాన్ని వ్యక్తం చేసింది. Read more