TSRTC luxury buses

పండగవేళ ఆర్టీసీ బస్సుల దోపిడి

పండగ పూట ఇంటికెళ్లేందుకు నగర ప్రజలంతా పల్లెబాట పడుతుండగా.. ఇదే అదునుగా చేసుకుని తెలంగాణలో ఆర్టీసీ యాజమాన్యం మోత మోగిస్తోందని ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. నేటి నుంచి స్కూళ్లకు సెలవులు ప్రకటించటంతో.. ఒక రోజు ముందు జనవరి 10 నుంచే బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ మొదలైంది. ఈ నేపథ్యంలో.. టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం గురువారం నుంచే సంక్రాంతి స్పెషల్ బస్సులను నడిసపిస్తోంది. అయితే.. సంక్రాంతి స్పెషల్ బస్సుల పేరుతో.. అడ్డగోలుగా టికెట్ రేట్లను పెంచేసి.. ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.

ఈ మేరకు సోషల్ మీడియాల్లో బస్సు టికెట్లను ప్రయాణికులు షేర్ చేస్తే.. సంక్రాంతి పండగ పూట ఆర్టీసీ బాదుడు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో.. సంక్రాంతికి స్పెషల్ బస్సుల పేరుతో ఆర్టీసీ దోపిడీ చేస్తోందంటూ వనపర్తికి చెందిన ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు.

ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితమే కానీ.. పురుషుల దగ్గర మాత్రం కండక్టర్లు ఎక్స్‌ట్రా ఛార్జీలు వసూలు చేస్తూ జేబులు గుల్ల చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. వనపర్తి నుంచి మహబూబ్ నగర్‌కు సాధారణంగా ఛార్జీ రూ.100 ఉంటే.. ఇప్పుడు రూ.140 వసూలు చేస్తున్నారని.. అందుకు సాక్ష్యంగా తన టికెట్‌ను ఫొటో తీసి మరీ పోస్ట్ చేశాడు. మహిళల ఛార్జీలు కూడా పురుషుల దగ్గర వసూలు చేస్తున్నారంటూ మండిపడుతూ ట్వీట్ చేశాడు.

మరోవైపు.. ఈ దారిదోపిడి సాధారణ ప్రయాణికుల దగ్గరే కాదు.. దివ్యాంగుల దగ్గర కూడా చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజా పాలనలో పండుగ పేరుతో ఆర్టీసీ టికెట్ రేట్లు అంతకంత పెంచి దోపిడీ చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. సాధారణ రోజుల్లో వికలాంగులకు హాఫ్ టికెట్ ఉంటే.. పండుగ పేరుతో వారికి కూడా ఫుల్ టికెట్ తీసుకుంటూ దోపిడీ చేస్తున్నారంటూ తెలంగాణ ఆర్టీసీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts
కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే కేంద్ర మంత్రి, తెలంగాణ Read more

2030 నాటికి నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని నిర్మించడంపై దృష్టి సారించిన తెలంగాణ
Telangana Focused on Building Skilled Workforce by 2030 .EY Parthenon . CII Report

హైదరాబాద్ : నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ యొక్క డిమాండ్‌లకు అనుగుణంగా తెలంగాణ తన విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడానికి పరివర్తనాత్మక చర్యలు Read more

ప్రధానితో రేవంత్ రెడ్డి భేటీ – కీలక అంశాలపై నివేదిక
ప్రధానితో రేవంత్ భేటీ - కీలక అంశాలపై నివేదిక

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపైన చర్చ జరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు… పెండింగ్ అంశాల పైన సీఎం Read more

రియల్ ఎస్టేట్ సంక్షోభానికి కారణం రేవంత్ రెడ్డి: హరీష్ రావు
రియల్ ఎస్టేట్ సంక్షోభానికి కారణం రేవంత్ రెడ్డి: హరీష్ రావు

తెలంగాణలో రియల్ ఎస్టేట్ సంక్షోభానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులతో రియల్ ఎస్టేట్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *