gas leak

కొనసాగుతున్న భోపాల్ గ్యాస్ వ్యర్థాల తొలగింపు

భోపాల్ లో 40 ఏళ్ళ క్రితం జరిగిన గ్యాస్ లీక్ దుర్ఘటన వేదన ఇంకా వెంటాడుతున్నది. నిద్రలోనే వేలాది మంది ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఆనాటి దుర్ఘటన ఎవరూ మర్చిపోలేని గాయం అది. అప్పట్లో లీకైన విష వాయువుకు సంబంధించిన వ్యర్థాలను యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఆవరణలో జాగ్రత్తగా నిల్వ చేశారు. ప్రస్తుతం ఈ వ్యర్థాలను తొలగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. తొలుత ఫ్యాక్టరీ ఆవరణలో నిల్వ చేసిన సుమారు 377 టన్నుల వ్యర్థాలను పిథంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాకు తరలించి, ఇంజనీరింగ్ నిపుణులతో వాటిని మండించనున్నారు.


3,800 మంది ప్రాణాలు కోల్పోయారు
1984 డిసెంబరు 2 అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో ప్రమాదకర మీథైల్ ఐసోసైనేట్ (ఎంఐసీ) గ్యాస్ లీక్ అయింది. ఈ విషవాయువు గాలిలో కలిసి ఫ్యాక్టరీ పరిసరాలతో పాటు భోపాల్ సిటీలో వ్యాపించింది. విషవాయువు కారణంగా ఫ్యాక్టరీ కార్మికులతో పాటు భోపాల్ లో మొత్తం 3,800 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇంజనీర్ల ఆధ్వర్యంలో ధ్వంసం
ఇందులో భాగంగా బుధవారం రాత్రి విషపూరిత రసాయన వ్యర్థాలను 12 సీల్డ్ కంటైనర్లలో లోడ్ చేశారు. వంద మంది కార్మికులు షిప్టుల వారీగా (అరగంట చొప్పున) పనిచేశారు. పని పూర్తయ్యాక కార్మికులకు అధికారులు వైద్య పరీక్షలు చేయించారు.

అనంతరం కంటైనర్ ట్రక్కులు అక్కడి నుంచి 250 కిలోమీటర్ల దూరంలోని పిథంపూర్ కు బయలుదేరాయి. ట్రక్కులు జాగ్రత్తగా వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. పిథంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ వ్యర్థాలను రామ్‌కీ ఎన్విరో ఇంజినీరింగ్ కళాశాల ఇంజనీర్ల ఆధ్వర్యంలో ధ్వంసం చేయనున్నారు. ఇందుకు 153 రోజులు పడుతుందని అధికారుల అంచనా.

Related Posts
భూమిని చేరుతున్న 5 గ్రహశకలాల ముప్పు?
భూమిని చేరుతున్న 5 గ్రహశకలాల ముప్పు?

నాసా ప్రకారం, ఈ రోజు ఐదు గ్రహశకలాలు భూమి వైపు ప్రయాణిస్తూ భయంకరమైన సమీపానికి చేరుకోనున్నాయి. ఇవి భూమికి ప్రమాదమా? ఈ అంశంపై నాసా అందించిన నివేదిక. Read more

BJP నేతకు తల వంచి నమస్కరించిన IAS
Rajasthan District Collecto

రాజస్థాన్ బార్మర్ జిల్లా కలెక్టర్ టీనా దాబి BJP నేత సతీష్ పూనియాకు వంగి వంగి నమస్కారాలు చేయడం పెద్ద చర్చనీయాంశమైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో Read more

రోడ్డు ప్రమాదాలతో గంటకు ఎంత మంది చనిపోతున్నారో తెలుసా..?
road accidents

దేశంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రవాణాశాఖ విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. 2023లో 4.80 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.72 లక్షల మంది చనిపోయారని తెలిపింది. Read more

ఆగ్రా-లక్నోహైవేపై ఘోర ప్రమాదం: నలుగురు మృతి
ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌హైవేపై ఘోర ప్రమాదం: నలుగురు మృతి

శనివారం ఉదయం ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై వారణాసి-జైపూర్ వెళ్తున్న బస్సు నిశ్చలంగా ఉన్న ట్రక్కును వెనుక నుంచి ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు Read more