కలెక్టర్ సదస్సులో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

AndhraPradesh: కలెక్టర్ సదస్సులో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్ల సమావేశం ఈ రోజు అమరావతి సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఉద్దేశించి ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు.అధికారులు ప్రజలకు ఆమోదయోగ్యంగా పనిచేయాలని, దర్పం ప్రదర్శించకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ పాలనను మెరుగుపరచాలని సూచించారు.

Advertisements

చంద్రబాబు వ్యాఖ్యలు

ప్రజలకు హామీ ఇచ్చినట్లుగా రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు.అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.సంక్షేమ పథకాలు లేకుంటే పేదరిక నిర్మూలన సాధ్యపడదని, అందుకే సంక్షేమాన్ని అభివృద్ధితో కలిపి అమలు చేస్తామని చెప్పారు.తెలుగుదేశం పార్టీ పాలనలో పింఛను రూ.400 నుంచి రూ.4000 వరకు పెంచామని, ఇది దేశంలో ఎక్కడా లేదని వెల్లడించారు.204 అన్న క్యాంటిన్లు ప్రారంభించి పేదలకు అన్నదానం అందించామని తెలిపారు.దీపం పథకం కింద ఆడబిడ్డలకు ఒక సిలిండర్ ఉచితంగా ఇచ్చామని చెప్పారు.

అడ్మినిస్ట్రేషన్‌లో కీలక మార్పులు

చెత్త పన్ను రద్దు చేసి ప్రజల భారం తగ్గించామని అన్నారు.ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్ సి ప్రకటన చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.డిఎస్ సి నియామకాలను పకడ్బంధిగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అధికారులను ఆదేశించారు.ఎబిసిడిఈ విధానం అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు.

కలెక్టర్ సదస్సులో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇతర పథకాలు

బీసీల ఆర్థికాభివృద్ధికి గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్ అమలు చేశామని తెలిపారు.చేనేతలకు జీఎస్టీ రద్దు చేసి వారికి మేలు చేశామని చెప్పారు.సంక్షేమ పథకాలు బిచ్చగాలకు దానం చేసినట్లు కాదని, చివరి లబ్దిదారునికి కూడా సంక్షేమం అమలు జరగాలని చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు.

రాజధాని నిర్మాణం

అమరావతి రాజధాని నిర్మాణానికి 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు.విశాఖ లేదా అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగితే, అదే తరహాలో ల్యాండ్ పూలింగ్ మోడల్ అనుసరించాలన్నారు.జాతీయ రహదారుల పనులకు రూ. 55,000 కోట్లు, రైల్వే ప్రాజెక్ట్‌లకు రూ. 75,000 కోట్లు ఖర్చవుతున్నాయని చెప్పారు.ఇవి కేంద్ర ప్రాజెక్టులు అని, రాష్ట్రానికి సంబంధం లేదని భావించవద్దని కలెక్టర్లకు స్పష్టంగా చెప్పారు.కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు పరిపాలనా విధానాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

Related Posts
Chandrababu: సొంత నేతలపై చంద్రబాబు ఆగ్రహం
Chandrababu: సొంత నేతలపై చంద్రబాబు ఆగ్రహం

నామినేటెడ్ పదవుల భర్తీపై టెలీకాన్ఫరెన్స్ ఏపీ సీఎం చంద్రబాబు నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి Read more

శ్రీశైలం అధికారుల నిర్లక్ష్యానికి కార్మికుడు మృతి
శ్రీశైలం అధికారుల నిర్లక్ష్యానికి కార్మికుడు మృతి

శివరాత్రి ఉత్సవాల కోసం శ్రీశైలంలో చేసిన ఏర్పాట్లలో దురదృష్టవశాత్తు ఒక విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ కార్మికుడు ఒక తీవ్ర ప్రమాదంలో పడి ప్రాణాలు కోల్పోయారు. మహాశివరాత్రి Read more

Guntur: గుంటూరు నగర మేయర్ రాజీనామా!
Guntur City Mayor resigns!

Guntur: గుంటూరు నగర మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. నగరకమిషనర్‌ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో రెడ్ Read more

Andhra Pradesh: కొనసాగుతున్న ఏపీ కేబినెట్‌ సమావేశాలు పలు కీలక అంశాలపై చర్చ
కొనసాగుతున్న ఏపీ కేబినెట్‌ సమావేశాలు పలు కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ముఖ్యంగా అమరావతి అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సింగపూర్ ప్రభుత్వంతో భాగస్వామ్యం, అమరావతి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×