బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేఖా గుప్తా

Delhi budget: బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేఖా గుప్తా

అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలను అమలు చేసే దిశగా- ముఖ్యమంత్రి రేఖా గుప్తా సారథ్యంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కీలక నిర్ణయాలను తీసుకుంది. హామీలను అమలు చేయడానికి 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేపట్టింది. ఇందులో మహిళల భద్రత, విద్య- వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందక్కడి కమలనాథుల సర్కార్.

Advertisements
బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేఖా గుప్తా

తొలిసారిగా సమావేశమైంది ఢిల్లీ అసెంబ్లీ
బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారిగా సమావేశమైంది ఢిల్లీ అసెంబ్లీ. రేఖా గుప్తా బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. లక్ష కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రతిపాదనలను సభకు సమర్పించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖను స్వయంగా ఆమెనే పర్యవేక్షిస్తోన్నారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పలు అంశాల గురించి ప్రస్తావించారు. దీన్ని చారిత్రాత్మక బడ్జెట్‌గా అభివర్ణించారు. 10 సంవత్సరాల పాటు ఢిల్లీని పరిపాలించిన అవినీతి, అసమర్థ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి జనం చరమగీతం పాడారని రేఖా గుప్తా అన్నారు. మాజీ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, ఆతిషి సారథ్యంలో ఆప్ పాలన భ్రష్టు పట్టిందని, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఇష్టారీతిన సాగిందని విమర్శించారు.
మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత
ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు 2,144 కోట్ల రూపాయలను కేటాయించారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని, ఈ క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో 50,000 సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నట్లు చెప్పారు.
అర్హులైన ప్రతి మహిళకూ ప్రతి నెలా 2,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి ఉద్దేశించిన పథకానికి 5,100 కోట్ల రూపాయలను కేటాయించినట్లు రేఖా గుప్తా తెలిపారు. దీనితోపాటు అన్ని చోట్ల కూడా అటల్ క్యాంటీన్లను నెలకొల్పబోతోన్నామని, దీనికోసం 100 కోట్ల రూపాయలను వ్యయం చేయనున్నట్లు చెప్పారు.

Related Posts
ఈ ట్రైన్లో ఓన్లీ శాకాహారమే లభ్యం
ఈ ట్రైన్లో ఓన్లీ శాకాహారమే లభ్యం

ఢిల్లీ-కాట్రా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతదేశం లో రైలు ప్రయాణం అనేది ప్రత్యేక అనుభవాన్ని అందించే ఒక మాధ్యమంగా మారింది. రైలులో ప్రయాణం చేసినప్పుడు ఆహారమే ఒక Read more

బ్యాంకాక్‌లో జరిగిన ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ క్రౌన్ అందుకున్న రేచల్‌ గుప్తా
rachel gupta

పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల రేచల్ గుప్తా ప్రతిష్ఠాత్మకమైన 'మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024' కిరీటాన్ని గెలుచుకొని భారత్‌కి మరొక గౌరవాన్ని తెచ్చిపెట్టారు. ఈ పోటీలు థాయిలాండ్‌లోని Read more

Student: స్టేజీపైనే కుప్పకూలి మరణించిన విద్యార్థిని
Student: స్టేజీపైనే కుప్పకూలి మరణించిన విద్యార్థిని

విషాదం: కళాశాల ఫేర్‌వెల్ వేడుకలో విద్యార్థిని మృతి మహారాష్ట్రలోని ధారాశివ్‌ జిల్లాలో ఓ కాలేజీ ఫేర్‌వెల్ వేడుక విషాదంలోకి మారింది. స్నేహితులతో కలిసి నవ్వుతూ మాట్లాడిన ఆ Read more

భారత్, చైనాలో చమురు ధరల పెంపు?
Fuel Rates On

ఉక్రెయిన్-రష్యా దేశాలమధ్య జరుగుతున్న యుద్ధం వల్ల భారత్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. దీనితో ఉక్రెయిన్ పై యుద్దం చేస్తున్న రష్యా దూకుడును అడ్డుకునేందుకు అమెరికా తీసుకున్న Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×