votar card

ఓటర్ కార్డు ఓటుకు గ్యారంటీ కాదు: ఈసీ

ఇటీవల జరిగిన ఎన్నికలపై పలు అనుమానాలకు తావు వున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓటర్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటేసే హక్కు ఉన్నట్లు కాదని ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఓటర్ల జాబితాను అప్ డేట్ చేస్తున్నారు. జనవరి 1 తో పద్దెనిమిదేళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

యువతలో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు, ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అర్హులను ఓటర్ జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మరణించిన వారి పేర్లను తొలగిస్తున్నారు.


సవరించిన ఓటర్ల జాబితా
ఇందులో భాగంగా గతేడాది ఆగస్టులో బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వే నిర్వహించారని సీఈసీ వెల్లడించారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, కొత్త ఓటర్ల పేర్లను చేర్చి మొత్తంగా సవరించిన ఓటర్ల జాబితాను ఈ నెల 6న విడుదల చేయనున్నట్లు ఢిల్లీ సీఈసీ ఆఫీసు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే తప్పుడు పత్రాలతో ఓటర్ ఐడీ పొందిన ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించింది. ఒకటి కంటే ఎక్కువ ఐడీ కార్డులు కలిగి ఉండడం కూడా శిక్షార్హమైన నేరమని పేర్కొంది. ఓటర్ కార్డు ఉందంటే ఓటేసేందుకు గ్యారంటీ కాదని తెలిపింది.

Related Posts
దావోస్ : ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు
Babu With Fellow CMs In Dav

దావోస్‌లో జరిగిన 'కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్' సమావేశంలో ఒకే వేదికపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర Read more

ప్రియాంకా గాంధీ తరఫున సీతక్క ప్రచారం
sithakka priyanka

కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నేత, తెలంగాణ ఎమ్మెల్యే సీతక్క ప్రస్తుతం కేరళలోని వయనాడ్‌లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రియాంకా గాంధీ తరఫున ఆమె వయనాడ్ లోని Read more

సరదాగా స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు: వీడియో వైరల్
సరదాగా స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు

చాలా మంది పిల్లలు తల కిందులుగా దూకుతుంటారు. సరదాగా గంతులేస్తూ.. తలకిందులుగా దూకుతూ పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇలాంటి సరదా స్టంట్ చేయబోయి ఓ యువకుడు Read more

ఆప్ అగ్రనేతలకు చావు దెబ్బ!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడి అవుతున్నా యి. బీజేపీ అధికారం ఖాయమైంది. ఆప్ ప్రముఖులు ఓటమి బాట పట్టారు. కేజ్రీవాల్ తో సహా డిప్యూటీ Read more