AP government New Posting for IAS Officer amrapali

ఏపీలో ఆమ్రపాలికి కీలక బాధ్యతలు : ఏపీ ప్రభుత్వం

అమరావతి: తెలంగాణ నుండి రిలీవ్ అయిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యలు అప్పగించింది. ఏపీ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ వైస్ చైర్ పర్సన్ మరియు ఎండీగా ఆమ్రపాలిని నియమించడం జరిగింది. అదనంగా ఏపీ పర్యాటక సంస్థ సీఈవోగా కూడా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులను ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ జారీ చేశారు.

Advertisements

కాగా, ఇటీవలే తెలంగాణ నుండి కొంతమంది ఐఏఎస్ అధికారులు ఏపీకి చేరిన సంగతి తెలిసిందే. ఆమ్రపాలితో పాటు వాకాటి కరుణ మరియు వాణీ ప్రసాద్ కూడా ఈ రాష్ట్రానికి వచ్చారు. వారిని కూడా తాజాగా పోస్టింగ్ లు ఇచ్చారు. వాకాటి కరుణను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గా నియమించారు. ఆమెకు నేషనల్ హెల్త్ మిషనర్ డైరెక్టర్ గా కూడా అదనపు బాధ్యతలు కేటాయించబడ్డాయి. వాణీ ప్రసాద్ ను కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. వీరితోపాటు ప్రస్తుతం పురావస్తు శాఖ కమిషనర్ గా పనిచేస్తున్న జి. వాణీ మోహన్‌ను సాధారణ పరిపాలన శాఖలో సర్వీస్ వ్యవహారాల ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు.

Related Posts
AP Govt: నేడు ఏపీలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభం
Ashok Leyland plant to be inaugurated in AP today

AP Govt: నేడు ఏపీలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభం కానుంది. మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను ఈరోజు సాయంత్రం 5గంటలకు మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు. Read more

Telangana: తెలంగాణలో మొదలైన ధాన్యం కేంద్రాలు
తెలంగాణలో ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు

తెలంగాణలోని రైతుల కోసం రబీ సీజన్‌లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. వరి కోతలు ప్రారంభం అవ్వడంతో, మార్కెట్‌లో ధరలు Read more

జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్..కొన్న 40 రోజులకే
electric bike explodes in j

తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు ఇస్తూ ప్రోత్సహిస్తుంటే..మరోపక్క ఎలక్ట్రిక్ బైక్లు పేలుతున్న ఘటనలు వాహనదారులకు షాక్ కలిగిస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో కొన్న 40 రోజులకే Read more

Anchor Shyamala: ఇకపై బెట్టింగ్ లు ప్రమోట్ చేయను: యాంకర్ శ్యామల
I will no longer promote betting.. Anchor Shyamala

Anchor Shyamala : వైసీపీ నాయకురాలు, యాంకర్ శ్యామల ఆన్ లైన్ బెట్టింగ్ ను ప్రమోట్ చేశారనే కేసులో ఈరోజు పోలీసు విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ పంజాగుట్ట Read more

×