AP government New Posting for IAS Officer amrapali

ఏపీలో ఆమ్రపాలికి కీలక బాధ్యతలు : ఏపీ ప్రభుత్వం

అమరావతి: తెలంగాణ నుండి రిలీవ్ అయిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యలు అప్పగించింది. ఏపీ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ వైస్ చైర్ పర్సన్ మరియు ఎండీగా ఆమ్రపాలిని నియమించడం జరిగింది. అదనంగా ఏపీ పర్యాటక సంస్థ సీఈవోగా కూడా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులను ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ జారీ చేశారు.

కాగా, ఇటీవలే తెలంగాణ నుండి కొంతమంది ఐఏఎస్ అధికారులు ఏపీకి చేరిన సంగతి తెలిసిందే. ఆమ్రపాలితో పాటు వాకాటి కరుణ మరియు వాణీ ప్రసాద్ కూడా ఈ రాష్ట్రానికి వచ్చారు. వారిని కూడా తాజాగా పోస్టింగ్ లు ఇచ్చారు. వాకాటి కరుణను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గా నియమించారు. ఆమెకు నేషనల్ హెల్త్ మిషనర్ డైరెక్టర్ గా కూడా అదనపు బాధ్యతలు కేటాయించబడ్డాయి. వాణీ ప్రసాద్ ను కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. వీరితోపాటు ప్రస్తుతం పురావస్తు శాఖ కమిషనర్ గా పనిచేస్తున్న జి. వాణీ మోహన్‌ను సాధారణ పరిపాలన శాఖలో సర్వీస్ వ్యవహారాల ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు.

Related Posts
బిహార్ లో మఖానా బోర్డు.. దాని గురించి తెలుసా?
Makhana Board

బిహార్ రాష్ట్రంలో మఖానా బోర్డు ఏర్పాటు చేయబడుతుందని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తాజా బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత మఖానా గురించి అందరి ఆసక్తి Read more

బడ్జెట్ పై జీవన్ రెడ్డి ఆగ్రహం
jeevan redy budget

దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఆ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా Read more

2030 నాటికి నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని నిర్మించడంపై దృష్టి సారించిన తెలంగాణ
Telangana Focused on Building Skilled Workforce by 2030 .EY Parthenon . CII Report

హైదరాబాద్ : నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ యొక్క డిమాండ్‌లకు అనుగుణంగా తెలంగాణ తన విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడానికి పరివర్తనాత్మక చర్యలు Read more

బీసీల రక్షణ చట్టంపై మంత్రుల కమిటీ కసరత్తు
chandrababu

బీసీ సంక్షేమ హాస్టళ్లలో వసతుల కల్పనపై ముఖ్యమంత్రి సమీక్షించారు. బాలికల హాస్టళ్లు తక్షణమే మరమ్మతులు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 1,110 బీసీ విద్యార్థుల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *