ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల హామీల్లో మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. త్రిముఖ పోటీ ఆసక్తి మారుతున్న సమీకరణాలతో పార్టీల నాయకత్వం అప్రమత్తం అవుతోంది. బీజేపీ తాజాగా మేనిఫెస్టో విడుదల చేసింది. ఇప్పుడు మాజీ సీఎం ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ మరో కీలక హామీ ప్రకటించారు.
హోరెత్తుతున్న ప్రచారం ఢిల్లీలో ఎన్నికల పైన ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. కొంత కాలంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఎవరికి విజయం దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. అధికారం నిలబెట్టుకొనే ప్రయత్నంలో కేజ్రీవాల్ ఉన్నారు.

ఉచిత విద్యుత్ – నీరు అందులో భాగంగా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరో హామీని ప్రకటించారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజధానిలోని అద్దె ఇళ్లల్లో నివసించే వారికి ఉచిత విద్యుత్, నీరు అందిస్తామని పేర్కొన్నారు. పూర్వాంచల్‌కు చెందిన అనేక మంది కౌలుదారులకు సైతం ఉచిత విద్యుత్, నీటి సౌకర్యాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తనకు అద్దెకు ఉండే వారి నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తమకు ఉచిత విద్యుత్, నీరు లేవని వారు వాపోతున్నారని..వారికి ఉపశమనం కలిగించేలా తాము అధికారంలోకి వస్తే కొత్త నిర్ణయాలు ఉంటాయని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. పోటా పోటీగా హామీలు కాంగ్రెస్ ఇప్పటికే భారీ హామీలు ఇచ్చింది. 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ 55 కే గ్యాస్, ఉచిత రేషన్ కిట్లు, నిరుద్యోగ యువతకు రూ 8,500, ప్రతీ నెలా మహిళలకు రూ 2,500 ఆర్దిక సాయం.. రూ 25 లక్షల వరకు ఆరోగ్య భీమా పైన హామీ ఇచ్చింది.