revanth reddy 292107742 16x9 0

అల్లుఅర్జున్ అరెస్ట్ పై ప్రముఖుల స్పందన

శుక్రవారం ఉదయం జరిగిన సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ పార్లమెంట్ మీడియా లాబీ వద్ద మాట్లాడుతూ… చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో తన జోక్యం ఉండదని అన్నారు.
బండి సంజయ్ స్పందన
అల్లు అర్జున్ అరెస్ట్ పై కేంద్ర మంత్రి తీవ్ర విచారం వెలుబుచ్చారు. ఓ నేరస్థుడ్ని అరెస్ట్ చేసినట్లు చేస్తారా అని బండి ఆగ్రహం వ్యక్తం చేసారు. తన సినిమా ద్వారా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న అల్లును ఈ విధంగా అగౌవరపరచడం సరికాదని బండి అన్నారు. భారీ ఎత్తున సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ సరిగ్గా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం పెద్ద తప్పు అని బండి విమర్శించారు.
హరీష్ రావు విమర్శ
అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..?
ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు?
సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.
దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే.
మరోవైపు, గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అక్కడి నుంచి ఆయనను నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలిస్తున్నారు. నాంపల్లి కోర్టు వద్దకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.

Related Posts
మలయాళ మూవీ రికార్డ్
rekhachithram

మలయాళంలో వేణు కున్నప్పిలి నిర్మించిన ఈ సినిమాకి, జోఫిన్ చాకో దర్శకత్వం వహించాడు. మర్డర్ మిస్టరీ తో కూడిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది.క్రితం ఏడాది ఆరంభం Read more

టన్నెల్ ప్రమాదంపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్
MLC Kavitha tweet on tunnel accident

ప్రమాదంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెంటనే స్పందించాలి హైదరాబాద్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శ్రీ శైలం ఎడమ కాలువ గట్టు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ప్రమాదం Read more

పెళ్లి తర్వాత శోభిత సినిమాల్లో నటిస్తుందా..? చైతు ఏమన్నాడంటే..!!
chaitu weding date

టాలీవుడ్ నటుడు నాగచైతన్య, నటి శోభిత మరికొద్ది గంటల్లో ఒకటి కాబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియో లో రేపు (డిసెంబర్ 04) వీరి వివాహం అట్టహాసంగా జరగబోతుంది. ఈ Read more

వివాదంలో రిషబ్ శెట్టి కాంతార 2
వివాదంలో రిషబ్ శెట్టి కాంతార 2

కాంతార చాప్టర్ 2 చిత్రీకరణలో భాగంగా రిషబ్ శెట్టి బృందం అడవులకు నష్టం కలిగించిందని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. కర్ణాటకలోని గవిగుడ్డ అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుతున్న Read more