hydra అల్కాపురిలో అక్రమ షట్టర్లపై హైడ్రా పంజా

అల్కాపురిలో అక్రమ షట్టర్లపై హైడ్రా పంజా

హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా, అల్కాపురిలోని కొన్ని అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసిరింది. ‘మార్నింగ్ రాగా’ అపార్ట్ మెంట్ లో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన షట్టర్లను (దుకాణాలను) హైడ్రా నేడు తొలగించింది. ఈ షట్టర్లకు సంబంధించి మణికొండ మున్సిపాలిటీ అధికారులు నవంబరు 27నే నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో షట్టర్లను తొలగించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ, ఆ షట్టర్ల సొంతదారుల నుంచి స్పందన లేదు. దాంతో, మున్సిపల్ అధికారులు ఈ విషయాన్ని హైడ్రాకు నివేదించగా, హైడ్రా రంగంలోకి దిగి ఆ షట్టర్లను కూల్చివేసింది.
ఈ సందర్భంగా, అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. హైడ్రా సిబ్బందిని, పోలీసులను అడ్డుకునేందుకు అపార్ట్ మెంట్ వాసులు ప్రయత్నించారు. అయితే, ఆ షట్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే తొలగిస్తున్నామని హైడ్రా సిబ్బంది స్పష్టం చేశారు. గత కొంతకాలంగా హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా వున్న కట్టడాలను కూల్చివేస్తున సంగతి తెలిసిందే. ఇటీవల హైకోర్ట్ హైడ్రా కూల్చివేతపై నిబంధనలు పాటించాలని పెర్కొంది.

Related Posts
telangana budget :తెలంగాణ బడ్జెట్‌లో మహిళలకే ప్రాధాన్యత
తెలంగాణ బడ్జెట్‌లో మహిళలకే ప్రాధాన్యత

తెలంగాణ బడ్జెట్ 2025-26 ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ప్రవేశపెట్టారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది రెండవ బడ్జెట్. భట్టి విక్రమార్క Read more

Revanth Reddy : నరేంద్ర మోదీ మంత్రులకు పెద్దన్న లాంటి వారు: రేవంత్ రెడ్డి
Revanth Reddy నరేంద్ర మోదీ మంత్రులకు పెద్దన్న లాంటి వారు రేవంత్ రెడ్డి

Revanth Reddy : నరేంద్ర మోదీ మంత్రులకు పెద్దన్న లాంటి వారు: రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్దన్న లాంటి వారని, అలాంటి Read more

సుభాష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన కాంగ్రెస్
subhash

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం సీనియర్ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు Read more

గాలిపటాలు ఎగురవేయవద్దు: డిస్కం
గాలిపటాలు ఎగురవేయవద్దు డిస్కం

తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టిజిఎస్పిడిసిఎల్) అధికారులు విద్యుత్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో గాలిపటాలు ఎగురవేయవద్దని ప్రజలను హెచ్చరించారు, ఇది ప్రమాదకరమైన Read more