116008039

సూపర్ స్టార్ దర్శన్ కు బెయిల్

ప్రముఖ కన్నడ నటుడు, శాండిల్‌వుడ్ సూపర్ స్టార్ దర్శన్ తూగుదీపకు ఊరట లభించింది. రేణుక స్వామి హత్యకేసులో అరెస్టయిన ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే కర్ణాటక హైకోర్ట్ ఆయనకు ఈ బెయిల్‌ను ఇచ్చింది.
అలాగే- ఇదే కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ నటి పవిత్ర గౌడ, మరో 15 మంది నిందితులకూ షరతులతో కూడిన బెయిల్ లభించింది. ప్రస్తుతం దర్శన్ తాత్కాలిక బెయిల్‌పై ఉన్నారు. బళ్లారి సెంట్రల్ జైలులో అనారోగ్యానికి గురైన నేపథ్యంలో న్యాయస్థానం ఆయనకు ఆరు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు కర్ణాటక హైకోర్టు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది.
ఈ కేసు జాతీయ స్థాయిలోనే త్రీవ సంచలనంగా మారినవిషయం తెలిసేందే.
తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దర్శన్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎస్ విశ్వజిత్ షెట్టి సారథ్యంలోని బెంచ్ దీనిపై విచారణ చేపట్టింది. దర్శన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ సీవీ నగేష్ వాదించారు. వాదోపవాదాలను ఆలకించిన తరువాత తీర్పును డిసెంబర్ 9వ తేదీన రిజర్వ్ చేశారు న్యాయమూర్తి. తాజాగా దాన్ని వెల్లడించారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌.. ప్రధాన నిందితుడు. కన్నడ నటి పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అసభ్యకర, అశ్లీలకరమైన పోస్టులు, కామెంట్స్ చేస్తుండేవాడనే కారణంతో రేణుకా స్వామిపై కక్ష పెంచుకుని సుపారీ ఇచ్చి అతణ్ని హత్య చేయించాడనే ఆరోపణలపై ఈ ఏడాది జూన్ 11వ తేదీన అరెస్ట్ అయ్యారు. దర్శన్, పవిత్ర గౌడ, మరో 15 మంది పేర్లపై పోలీసులు ఛార్జిషీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 3,991 పేజీల ఛార్జ్‌షీట్ ఇది. ఇందులో ఏ1గా పవిత్ర గౌడ, ఏ2గా దర్శన్‌‌ పేర్లను నమోదు చేశారు. బెంగళూరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం ఈ ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు అందజేసింది.

Advertisements
Related Posts
ముంబైలో “డిజిటల్ అరెస్ట్” పేరిట మహిళను మోసం చేసిన నకిలీ పోలీసుల బృందం
digital arrest

ముంబైలో ఒక మహిళను ఓ మోసపూరిత స్మగ్లర్ బృందం మోసం చేసింది. వీడియో కాల్ ద్వారా ఆమెను బలవంతంగా నగ్నంగా చేయించి ₹1.7 లక్షలు దోచుకున్నారు. పోలీసులు Read more

Earth Day: నేడు ఇంటర్నేషనల్ ఎర్త్ డే ..దీని గురించి తెలుసుకుందాం
నేడు ఇంటర్నేషనల్ ఎర్త్ డే ..దీన్ని ఇలా కాపాడుకుందాం..

ఇంటర్నేషనల్ ఎర్త్ డేను ఏటా ఏప్రిల్ 22న నిర్వహిస్తారు. 1970‌లో ఇదే తేదీన అమెరికాలోని భిన్న నగరాల్లో దాదాపు 2 కోట్ల మంది పర్యావరణానికి జరుగుతున్న హానిపై Read more

సైఫ్ అలీ ఖాన్ కేసులో నిందితుడు అరెస్ట్?
saif ali khan

నిన్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసిన నిందితుడ్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం. ప్రస్తుతం నిందితుడ్ని అక్కడి Read more

మన్మోహన్ సింగ్ అస్తికల నిమజ్జనానికి హాజరుకాని కాంగ్రెస్?
మన్మోహన్ సింగ్ అస్తికల నిమజ్జనానికి హాజరుకాని కాంగ్రెస్?

కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ అస్తికల నిమజ్జనానికి ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇచ్చింది. అంత్యక్రియల అనంతరం, కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ మరియు ప్రియాంక గాంధీ Read more

Advertisements
×