nagababu rajyasabha

రాజ్యసభకు పవన్ కళ్యాణ్ సోదరుడు..?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. సోదరుడు నాగబాబును రాజ్యసభకు పంపే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాల్లో ఒకటి తమకు కేటాయించాలని పవన్ కళ్యాణ్..NDA ను కోరినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్, ఢిల్లీ పర్యటనలో ఎన్డీఏ పెద్దలతో ఈ విషయాన్ని ప్రస్తావించారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అనకాపల్లి స్థానంలో నాగబాబు పోటీపడాలని అనుకుంటున్నప్పటికీ, ఈ స్థానం బీజేపీకి కేటాయించబడింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నాగబాబును రాజ్యసభకు పంపించాలని భావించారని సమాచారం.

పవన్ కళ్యాణ్ ఇప్పటికే బీజేపీతో సమన్వయాన్ని కాంక్షిస్తూ, పార్టీ మధ్య సంయుక్త ఆలోచనలు నిర్వహిస్తున్నారు. జనసేనతో బీజేపీ మిత్ర సంబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటె రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ బిజీ గా గడుపుతూ వచ్చారు. వరుసగా కేంద్రమంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబదించిన పలు విషయాలను ప్రస్తావించారు. అలాగే మోడీ తో కూడా భేటీ అయ్యారు. ఇక నిన్న రాత్రి తెలంగాణ , ఏపీ ఎంపీలతో పాటు పలువురు బిజెపి ఇతర రాష్ట్రాల ఎంపీలకు విందు ఏర్పాటు చేసారు.

Related Posts
మోహన్ బాబు క్షమాపణలకు సిద్ధం: సుప్రీం కోర్టు తీర్పు
మోహన్ బాబు క్షమాపణలకు సిద్ధం: సుప్రీం కోర్టు తీర్పు

జర్నలిస్టుపై దాడి కేసులో పోలీసులు ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశిస్తూ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టు ఈ రోజు (జనవరి 9) మధ్యంతర ఉపశమనం ఇచ్చింది. Read more

కేటీఆర్ అమరణ నిరాహార దీక్ష..ఎంపీ చామల కౌంటర్
KTR hunger strike to death..MP Chamala counters

హైదరాబాద్‌: స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కేటీఆర్‌కు దళితులపై Read more

వంశీ కి బెయిల్ వచ్చేనా!
వంశీ కి బెయిల్ వచ్చేనా!

ఆంధ్రప్రదేశ్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వల్లభనేని వంశీ అరెస్టు, రిమాండ్ వ్యవహారం ప్రస్తుత పరిణామాలతో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై Read more

రష్యా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ
Prime Minister Modi left for Russia

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ‘బ్రిక్స్’ 16వ సదస్సులో పాల్గొనేందుకు రష్యా బయలుదేరారు. కజాన్ నగరంలో జరుగుతున్న ఈ సమ్మిట్‌లో, ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *