winter

పెరిగిన చలి మైనస్ లో ఉష్ణోగ్రత

డిసెంబర్ మాసం అంటేనే చలి వణికిస్తుంది. అయితే ఇటీవల అల్పపీడన ప్రభావంతో చలిలో తీవ్ర మార్పులు వస్తున్నాయి. ఒక్కసారిగా చలి విపరీతంగా పెరిగింది. దీనికి కారణం హిమాలయాల పశ్చిమ ప్రాంతం మీదుగా వీస్తోన్న గాలుల ప్రభావం వల్ల చలి అమాంతంగా పెరిగినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో మున్ముందు రాత్రి ఉష్ణోగ్రత మరింత క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. చంటి పిల్లలు, వృద్దులు జాగ్రత్తగా వుండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు .

Advertisements

గత 24 గంటల వ్యవధిలో కనిష్ఠ ఉష్ణోగ్రత పంజాబ్‌లో నమోదైంది. ఇక్కడి ఆదంపూర్‌లో టెంపరేచర్ మైనస్‌లో పడిపోయింది. -0.4గా రికార్డయింది. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలో ఉండే గ్రామం ఇది. దీని తరువాత హర్యానా హిసార్‌లో అత్యల్పంగా 1.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హిమాలయ పర్వత శ్రేణుల మీదుగా వీస్తోన్న చలిగాలులు, అక్కడ కురుస్తోన్న మంచు వర్షం వల్ల చలిగాలుల తీవ్రత ఇక్కడ ఒక్కసారిగా పెరిగింది. రాజస్థాన్‌లోని చురు- 3.1, పంజాబ్ అమృత్‌సర్- 3.8, రాజస్థాన్ పిలానీ- 4.0, ఉత్తరప్రదేశ్ సర్సవా- 4.1, పంజాబ్ హల్వారా ఐఎఎఫ్- 4.1, రాజస్థాన్ ఉత్తర్‌లై ఐఎఎఫ్- 4.2, హర్యానా భివానీ- 4.6 డిగ్రీల సెల్సియస్ మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్- 4.6, రాజస్థాన్ చిత్తోర్‌గఢ్- 4.7, మధ్యప్రదేశ్ ఉమేరియా- 4.8, ఉత్తరప్రదేశ్ బరేలీ- 4.9 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత రికార్డయినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

Related Posts
high court : పోర్న్‌ చెడ్డ అలవాటే, అలాని విడాకులు కుదరదు: హైకోర్టు
పోర్న్‌ చెడ్డ అలవాటే, అలాని విడాకులు కుదరదు: హైకోర్టు

భార్య పోర్న్ వీడియోలకు బానిసగా మారిందనే కారణంతో విడాకులు మంజూరు చేయలేమని మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. అంతేకాదు, పెళ్లైనంత మాత్రాన మహిళలు తమ లైంగిక Read more

న్యూఢిల్లీ లోని ఎర్రకోట ప్రాంగణంలో స్వాతంత్య్ర దినోత్సవం
న్యూఢిల్లీ లోని ఎర్రకోట ప్రాంగణంలో స్వాతంత్య్ర దినోత్సవం

భారతదేశంలో రెండు ప్రధాన జాతీయ పండుగలు మనకు ఎంతో గొప్ప ప్రేరణనిచ్చే రోజులు – ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం మరియు జనవరి 26 గణతంత్ర దినోత్సవం. Read more

Annamalai : తాను అధ్యక్షుడి రేసులో లేనన్న అన్నామలై
Annamalai తాను అధ్యక్షుడి రేసులో లేనన్న అన్నామలై

తమిళనాడు బీజేపీలో నాయకత్వ మార్పుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.తమను కొత్త Read more

Waqf Amendment Bill : వక్ఫ్‌ బిల్లు ఆమోదం..సరికొత్త యుగానికి నాంది: ప్రధాని మోడీ
Approval of Waqf Bill marks the beginning of a new era.. Prime Minister Modi

Waqf Amendment Bill : ఎట్టకేలకు వివాదాస్పద వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025 పార్లమెంటు ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార, విపక్షాల మధ్య తీవ్ర Read more

×