kishan reddy warning

పద్ధతి మార్చుకోవాలంటూ రేవంత్‌రెడ్డికి కిషన్ రెడ్డి కౌంటర్

మూసీ పరివాహక ప్రాంతాల్లో “బీజేపీ మూసీ నిద్ర” కార్యక్రమం చేపట్టింది. మూసి సుందరీకరణ పేరుతో మూసి వాసుల ఇళ్లను కూల్చడం..అక్కడి ప్రజలను మరోచోటుకు తరలించడం పట్ల బిఆర్ఎస్ తో పాటు బిజెపి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్న వారిని సడెన్ గా ఇక్కడి నుండి వేరే చోటికి వెళ్ళమని చెప్పడం..ఇల్లు కూల్చేస్తాం అంటే ఎలా అని వారంతా ప్రశ్నించారు. అయితే సియోల్‌ తరహాలో హైదరాబాద్‌లో మూసీని పునరుజ్జీవింపజేస్తామంటూ తెలంగాణ లోని రేవంత్ సర్కార్ చెబుతోంది. మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడితే బుల్జోజర్లతో తొక్కిస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

Advertisements

రేవంత్‌ కామెంట్స్‌కు బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చూస్తున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అసలు ఎలా ఉండబోతోంది? అనేది ఇప్పటి వరకు ప్రజలకు, అధికారులకు ఎవరికీ తెలియదని, కానీ సర్కార్ మాత్రం అడ్డుగోలుగా నిరుపేదల ఇండ్లను కూల్చుతోందని ఘాటు విమర్శలు చేశారు. మూసీ సుందరీకరణకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని రెడ్డి ప్రశ్నించారు.

మూసీపై తాము నాలుగు నెలలుగా పోరాటం చేస్తున్నామన్నారు. ఇప్పటికే బాధితులతో తాము ధర్నా నిర్వహించినట్లు గుర్తుచేశారు. సీఎం ప్రకటనలతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడు బుల్డోజర్ తో ఇల్లు కూలుస్తారో అనే భయంలో ప్రజలు ఉన్నారన్నారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే బస్తీ నిద్ర చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుట్ర చేస్తోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. పేదల ఇండ్లు కూల్చాలన్నది ఏమాత్రం న్యాయం కాదని, రేవంత్ రెడ్డి.. ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని సూచించారు.

Related Posts
Telangana Govt Schools : సర్కారు బడుల్లో సమ్మర్ క్యాంపులు
Summer camps

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ఈసారి రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో వేసవి శిబిరాలను నిర్వహించబోతుంది. విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ శిబిరాలు సుమారు 15 Read more

Bharat : భారత్-పాక్ సైనిక శక్తి పోలికలో భారతదే పైచేయి
Bharat : భారత్-పాక్ సైనిక శక్తి పోలికలో భారతదే పైచేయి

భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాశ్మీర్‌లో పెహల్‌గాం ప్రాంతంలో పాక్‌కు చెందిన ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన కాల్పుల్లో 28 మంది మృతి చెందగా, భారత Read more

జాక్ పాట్.. అంటే ఈ లారీ డ్రైవేరేదేపో..!!
Truck driver wins Rs 10 cro

పంజాబ్‌లోని రూప్ నగర్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ హర్పిందర్ సింగ్ కు అదృష్టం తలుపుతట్టింది. పంజాబ్ స్టేట్ డియర్ లోహ్రీ మకర సంక్రాంతి బంపర్-2025 లాటరీలో Read more

Waqf: వక్ఫ్ బిల్లు వివాదం మణిపూర్ బీజేపీ నేత ఇంటికి నిప్పు
Waqf: వక్ఫ్ బిల్లు వివాదం మణిపూర్ బీజేపీ నేత ఇంటికి నిప్పు

వక్ఫ్ సవరణ చట్టం.. చుట్టుముట్టిన ఉద్రిక్తతలు వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన నేపథ్యంలో, రాష్ట్రపతి సంతకం చేయడంతో అది చట్టరూపం దాల్చింది. ఈ చట్టంతో Read more

Advertisements
×