WhatsApp Image 2024 12 17 at 11.52.32 AM

ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం నిత్యకృత్యంగా మారింది. గత వారం రోజుల్లో ఏకంగా మూడుసార్లు ఢిల్లీ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చాయి. మంగళవారం ఉదయం ఢిల్లీలోని కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌, నార్త్‌ వెస్ట్ ఢిల్లీలోని సరస్వతి విహార్‌లో గల ఓ పాఠశాలకు బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇ-మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆయా పాఠశాలల వద్దకు చేరుకొని విద్యార్థులను, సిబ్బందిని ఖాళీ చేయించారు. అనంతరం బాంబ్ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్ సాయంతో పాఠశాలల ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
బాంబు బెదిరింపులతో బేజారు
ఇటీవల విమానాల్లో బాంబు పెట్టినట్లు ఫోన్ కాల్స్ రావడం లేదా మెయిల్స్ రావడం పరిపాటుగా మారింది. తాజాగా స్కూల్స్ లో కూడా బాంబు బెదిరింపులు రావడంతో అధికారుల తలలు పట్టుకుంటున్నారు. గత వారం రోజుల్లో ఏకంగా మూడుసార్లు ఢిల్లీ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు రావడంతో అధికారుల అప్రమత్తం అయి తనిఖీలు నిర్వహించారు. ఫేక్ మెయిల్స్, కాల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు పోలీసులకు చెప్పారు.

Advertisements
Related Posts
Nitin Gadkari: కులం పేరెత్తితే కఠిన చర్యలు.. గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
Nitin Gadkari: కులం పేరెత్తితే ఊరుకోను.. కేంద్రమంత్రి గడ్కరీ సీరియస్ వార్నింగ్

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలకమైన మంత్రి, సీనియర్ బీజేపీ నేత నితిన్ గడ్కరీ తాజాగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. "కులం పేరెత్తితే కొడతా" అంటూ గడ్కరీ Read more

పాత వాహనాలపై GST పెంపు
పాత వాహనాలపై GST పెంపు

పాత విద్యుత్ వాహనాలపై GST పెంపు: ప్రతిపక్షం విమర్శలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) కౌన్సిల్ శనివారం Read more

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో నకిలీ గుండె వైద్యుడి నిర్వాకం
Fake heart doctor busted in Madhya Pradesh

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ నకిలీ వైద్యుడి నిర్వాకం వల్ల ఒకే నెలలో ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు. ఎన్‌ జాన్‌ కెమ్ Read more

Pahalgam: పహల్గాం ఉగ్రదాడి స్పందించిన ఆలియా భట్,జాన్వీ కపూర్
Pahalgam: పహల్గాం ఉగ్రదాడి స్పందించిన ఆలియా భట్,జాన్వీ కపూర్

కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా భారత్ ఉలిక్కిపడింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్‌ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ Read more

Advertisements
×