Biden

క్యూబా ఇక ఫ్రీ: బైడెన్ చారిత్రాత్మక నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జో బైడెన్.. చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. పొరుగుదేశం క్యూబపై ఉన్న ఉగ్రవాద దేశం ముద్రను తొలగించారు. అమెరికా రూపొందించుకున్న ఉగ్రవాద దేశాల జాబితా నుంచి క్యూబను తొలగించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్.. కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది.జో బైడెన్ పదవీ కాలం ముగియబోతోంది. ఈ నెల 19వ తేదీ వరకే ఈ హోదాలో కొనసాగుతారు. 20వ తేదీన ఆ దేశ 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ దేశ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం ఆరంభమౌతుంది.

Advertisements

ఒత్తిళ్ల నేపథ్యంలో జో బైడెన్ వెనక్కి
2021 జనవరి 12వ తేదీన క్యూబను ఉగ్రవాద దేశాల జాబితాలోకి చేర్చింది అమెరికా. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ ఫర్ ఫిస్కల్ ఇయర్ 2019లోని సెక్షన్లు 1754 (సీ), 1768 (సీ) కింద ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఉత్తరకొరియా, ఇరాన్, సిరియా ఈ జాబితాలో ఉన్న మిగిలిన దేశాలు. వాటి సరసన క్యూబానూ చేర్చింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. క్యూబపై ఉగ్రవాద ముద్ర వేయడం సరికాదంటూ 123 దేశాలు గతంలో ప్రకటించాయి. ఈ మేరకు ఓ డిక్లరేషన్‌పై అవి సంతకాలు చేశాయి. ఇందులో- యూరోపియన్ యూనియన్, స్పెయిన్, కెనడా, కొలంబియా, చిలీ, బ్రెజిల్.. వంటి దేశాలు దేశాల్లో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఈ డిక్లరేషన్‌ను అప్పట్లో జారీ చేసింది. ఆర్థికం సహా క్యూబాపై అనేక రకాల ఆంక్షలను విధించడాన్నీ తప్పుపట్టాయి. అంతర్జాతీయ వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో జో బైడెన్ వెనక్కి తగ్గినట్టే కనిపించింది. ఉగ్రవాద దేశాల జాబితా నుంచి క్యూబా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Related Posts
గాజా-ఇజ్రాయెల్ చర్చల మధ్య 70 మరణాలు
గాజా ఇజ్రాయెల్ చర్చల మధ్య 70 మరణాలు

గాజాలో ఇజ్రాయెల్ సైనిక దాడులు కారణంగా శనివారం 70 మంది మరణించినట్లు పాలస్తీనా వైద్యులు తెలిపారు. ఈ కాల్పులు, 15 నెలల యుద్ధాన్ని ముగించేందుకు మధ్యవర్తులు విరమణ Read more

రష్యా నూతన చట్టం
Russia new law to stamp out terrorism

మాస్కో: రష్యా పలు సంస్థలపై ఉగ్రవాద ముద్రను తొలగించే దిశగా చర్యలు చేపడుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా రష్యా కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఉగ్ర Read more

Myanmar earthquake : భూకంపం ధాటికి మయన్మార్ లో 25 మంది మృతి
Myanmar earthquake : భూకంపం ధాటికి మయన్మార్ లో 25 మంది మృతి

Myanmar earthquake : భూకంపం ధాటికి మయన్మార్ లో 25 మంది మృతి మయన్మార్ భారీ భూకంపం ధాటికి కుదేలైంది. రిక్టర్ స్కేల్ పై 7.7 తీవ్రతతో Read more

జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాపణ ఇచ్చినట్టు వైట్ హౌస్ ప్రకటన
joe biden scaled

డిసెంబర్ 1న, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు సంబంధించిన ఫెడరల్ గన్ మరియు పన్నుల నేరాలకు సంబంధించిన శిక్షలను "పూర్తిగా మరియు Read more

×