hydra అల్కాపురిలో అక్రమ షట్టర్లపై హైడ్రా పంజా

అల్కాపురిలో అక్రమ షట్టర్లపై హైడ్రా పంజా

హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా, అల్కాపురిలోని కొన్ని అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసిరింది. ‘మార్నింగ్ రాగా’ అపార్ట్ మెంట్ లో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన షట్టర్లను (దుకాణాలను) హైడ్రా నేడు తొలగించింది. ఈ షట్టర్లకు సంబంధించి మణికొండ మున్సిపాలిటీ అధికారులు నవంబరు 27నే నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో షట్టర్లను తొలగించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ, ఆ షట్టర్ల సొంతదారుల నుంచి స్పందన లేదు. దాంతో, మున్సిపల్ అధికారులు ఈ విషయాన్ని హైడ్రాకు నివేదించగా, హైడ్రా రంగంలోకి దిగి ఆ షట్టర్లను కూల్చివేసింది.
ఈ సందర్భంగా, అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. హైడ్రా సిబ్బందిని, పోలీసులను అడ్డుకునేందుకు అపార్ట్ మెంట్ వాసులు ప్రయత్నించారు. అయితే, ఆ షట్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే తొలగిస్తున్నామని హైడ్రా సిబ్బంది స్పష్టం చేశారు. గత కొంతకాలంగా హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా వున్న కట్టడాలను కూల్చివేస్తున సంగతి తెలిసిందే. ఇటీవల హైకోర్ట్ హైడ్రా కూల్చివేతపై నిబంధనలు పాటించాలని పెర్కొంది.

Advertisements

Related Posts
Hemophilia :రాయల్ డిసీజ్ పై పూర్తి అవగాహన
Hemophilia

హిమోఫిలియా అంటే ఏమిటి? రాయల్ డిసీజ్ పై పూర్తి అవగాహన ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని ప్రతి ఏప్రిల్ 17న జరుపుకుంటారు. ఇది ఫ్రాంక్ ష్నాబెల్ పుట్టినరోజు సందర్భంగా Read more

వారికి రైతు భరోసా ఇవ్వం తేల్చేసిన మంత్రి పొంగులేటి
Ponguleti Srinivasa Reddy

రైతు భరోసా పథకం అమలులో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని పాటిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రైతులకు ఉపశమనం కలిగించే ఈ పథకం, భూమి యోగ్యత Read more

SLBC ప్రమాద ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం
కష్టంగా కొనసాగుతున్నరెస్క్యూ ఆపరేషన్

నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద జరిగిన SLBC టన్నెల్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈనెల 22న టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు లోపల Read more

బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత‌లు
NKV BJP

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిమాణం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ మాజీ ఎంపీ సీతారాం నాయక్, బీజేపీ Read more

Advertisements
×