116008039

సూపర్ స్టార్ దర్శన్ కు బెయిల్

ప్రముఖ కన్నడ నటుడు, శాండిల్‌వుడ్ సూపర్ స్టార్ దర్శన్ తూగుదీపకు ఊరట లభించింది. రేణుక స్వామి హత్యకేసులో అరెస్టయిన ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే కర్ణాటక హైకోర్ట్ ఆయనకు ఈ బెయిల్‌ను ఇచ్చింది.
అలాగే- ఇదే కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ నటి పవిత్ర గౌడ, మరో 15 మంది నిందితులకూ షరతులతో కూడిన బెయిల్ లభించింది. ప్రస్తుతం దర్శన్ తాత్కాలిక బెయిల్‌పై ఉన్నారు. బళ్లారి సెంట్రల్ జైలులో అనారోగ్యానికి గురైన నేపథ్యంలో న్యాయస్థానం ఆయనకు ఆరు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు కర్ణాటక హైకోర్టు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది.
ఈ కేసు జాతీయ స్థాయిలోనే త్రీవ సంచలనంగా మారినవిషయం తెలిసేందే.
తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దర్శన్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎస్ విశ్వజిత్ షెట్టి సారథ్యంలోని బెంచ్ దీనిపై విచారణ చేపట్టింది. దర్శన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ సీవీ నగేష్ వాదించారు. వాదోపవాదాలను ఆలకించిన తరువాత తీర్పును డిసెంబర్ 9వ తేదీన రిజర్వ్ చేశారు న్యాయమూర్తి. తాజాగా దాన్ని వెల్లడించారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌.. ప్రధాన నిందితుడు. కన్నడ నటి పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అసభ్యకర, అశ్లీలకరమైన పోస్టులు, కామెంట్స్ చేస్తుండేవాడనే కారణంతో రేణుకా స్వామిపై కక్ష పెంచుకుని సుపారీ ఇచ్చి అతణ్ని హత్య చేయించాడనే ఆరోపణలపై ఈ ఏడాది జూన్ 11వ తేదీన అరెస్ట్ అయ్యారు. దర్శన్, పవిత్ర గౌడ, మరో 15 మంది పేర్లపై పోలీసులు ఛార్జిషీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 3,991 పేజీల ఛార్జ్‌షీట్ ఇది. ఇందులో ఏ1గా పవిత్ర గౌడ, ఏ2గా దర్శన్‌‌ పేర్లను నమోదు చేశారు. బెంగళూరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం ఈ ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు అందజేసింది.

Advertisements
Related Posts
అమెరికా వీడుతున్న భారతీయ పార్ట్ టైమర్స్
మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదు: ట్రంప్

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొలువుదీరిన వేళ భారతీయుల్లో భయాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లూ అమెరికాకు ఏదో విధంగా వెళ్లిపోయి అక్కడ స్థిరపడిపోవచ్చన్న ఆలోచనతో పయనమైన వారంతా Read more

మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు!
మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధర

సామాన్యులకు ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న ప్రజలకు మరో దెబ్బ తగిలింది. ఈరోజు మార్చి 1వ తేదీ. ప్రతినెల మొదటి రోజున Read more

ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను బిజినెస్ స్కూల్స్ నుండి నియమించాలి:నరాయణ మూర్తి
narayanamurthy

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త నరాయణ మూర్తి ఇటీవల ఐఎఎస్ (Indian Administrative Service) మరియు ఐపీఎస్ (Indian Police Service) అధికారులను UPSC (Union Public Read more

Teacher: డబ్బుల కోసం ఓ టీచర్ ఘనకార్యం
Teacher: డబ్బుల కోసం ఓ టీచర్ ఘనకార్యం

ఒక టీచర్‌లో దారుణమైన సంస్కారాహీనత: పోలీసుల దృష్టికి వచ్చిన దుర్ఘటన ప్రస్తుత కాలంలో, సమాజంలో ఎంతో గౌరవాన్ని కలిగిన పీఠంపై ఉండే వ్యక్తులు కూడా సరైన మార్గాన్ని Read more

×