sajjala ramakrishna reddy

సజ్జల కుటుంబంపై విచారణకు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తూ అరెస్ట్ చేస్తున్నది. వారిపై అక్రమ కేసుల్ని పెట్టి ఇబ్బందికి గురిచేస్తున్నది. తాజా అంశంగా సజ్జల కుటుంబంపై విచారణకు ఆదేశం వెల్లడైంది, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబీకులు ప్రభుత్వ, పేదల భూములు కబ్జా చేశారంటూ పెద్దఎత్తున ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సజ్జల రామకృష్ణారెడ్డి భూకబ్జాలపై వెంటనే విచారణ చేయాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. 52 ఎకరాల చుక్కల భూములు, ప్రభుత్వ భూములను సజ్జల కుటుంబీకులు కబ్జా చేశారనే ఆరోపణలు కొన్ని రోజులుగా గుప్పుమంటున్నాయి. ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చను లేవనెత్తింది.

సజ్జల కుటుంబంపై విచారణకు ఆదేశం


పేదలు, ప్రభుత్వ భూముల జోలికి ఎవ్వరూ వచ్చిన సహించేది లేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు విచారణకు ఆదేశించి కబ్జాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అటవీ, రెవెన్యూ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే తాను ఏ తప్పూ చేయలేదని, ఎటువంటి భూములను తాము ఆక్రమించలేదని సజ్జల బుకాయిస్తున్నారు.  డిప్యూటీ సీఎం ఆదేశాలతో అధికారులు విచారణ నిమిత్తం రంగంలోకి దిగారు. ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు భూములను సర్వే చేస్తున్నారు. మరోవైపు, ఈ భూముల్లోనే సజ్జల గెస్ట్ హౌస్ కట్టుకున్నట్టు తెలుస్తోంది.

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి చెందిన భూములపై విచారణ జరిపించాలని ఆదేశించారు. గురువారం వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి, అటవీ భూముల వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని సూచించారు. అటవీ భూముల సంరక్షణ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని పవన్‌ స్పష్టం చేశారు. సీకే దిన్నె ప్రాంతంలో 42 ఎకరాల అటవీ భూములున్నాయన్న సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో, పవన్‌ అటవీ అధికారులతో చర్చలు జరిపారు. సజ్జల కుటుంబం ఆక్రమించిన భూముల్లో రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నాయా? ఎన్ని ఎకరాలు ఆక్రమించారనే వివరాలతో నివేదికలను అందించాలంటూ కడప కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణలో ఏవిధమైన నిజాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ సజ్జల నిజంగానే అడవులను ఆక్రమించినట్లు తేలితే, ఆయనపై చర్యలు తప్పవని అర్థమవుతోంది.

Related Posts
అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతికి మోదీ నివాళి
atal bihari vajpayee

భారతదేశంలోని అగ్ర ప్రముఖ నాయకులలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రత్యేకమైన స్థానం కలిగిన వారిలో ఒకరని చెప్పవచ్చు. ఆయన 100వ జయంతి సందర్భంలో, ప్రస్తుత ప్రధాని నరేంద్ర Read more

10వ రోజు జూనియర్ డాక్టర్ల నిరవధిక నిరాహార దీక్ష
RG Kar issue. Junior doctors hunger strike enters 10th day

కోల్‌కతా : కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు గత 10 రోజులుగా నిరాహార దీక్షకు దిగారు. దీంతో Read more

సంక్రాంతికి వస్తున్నాం: క్రైమ్ స్టోరీ!
సంక్రాంతికి వస్తున్నాం: క్రైమ్ స్టోరీ!

వరుస హిట్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు దర్శకుడు అనిల్ రావిపూడి 'సంక్రాంతి వస్తున్నాం' అనే సంతోషకరమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమయ్యారు. వెంకటేష్ ప్రధాన Read more

తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు
తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు

తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నియామకం నేపథ్యంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు పుల్లెల గోపీచంద్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *