11 2

మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్ని రామకృష్ణారెడ్డి

అమరావతి: మరోసారి వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన గతంలో విధించిన బెయిల్ షరతులను సడలించాలని, విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టును తిరిగి ఇవ్వాలని కోరారు. శుక్రవారం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పిన్నెల్లి తరఫున న్యాయవాది రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ కుమారుడు సింగపూర్‌లో ఉన్నత విద్యను కొనసాగించడానికి వెళ్ళనున్నాడు కాబట్టి, తండ్రిగా పిన్నెల్లి కూడా ఆయనతో పాటు వెళ్లాల్సి ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. పాస్‌పోర్టు విడుదలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

ఇప్పటికే పోలీసుల తరఫున న్యాయవాది ఎన్ అశ్వనీకుమార్ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరగా, హైకోర్టు 28వ తేదీకి విచారణను వాయిదా వేసింది. మునుపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం, టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల సందర్భంగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించి షరతులతో కూడిన బెయిల్ పొందారు, ఈ నేపథ్యంలో బెయిల్ షరతుల సడలింపునకు పిటిషన్ దాఖలు చేశారు.

Related Posts
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25..మీ నిజమైన ఏఐ సహచరుడు: టిఎం రోహ్
Samsung best smartphone, the Galaxy S25: Your true AI companion: TM Roh

న్యూఢిల్లీ: గెలాక్సీ ఎస్25 అనేది కెమెరా మరియు బ్యాటరీ కోసం హార్డ్‌వేర్‌లో సాటిలేని నాయకత్వంతో వస్తున్న అతి సన్నటి మరియు అత్యంత మన్నికైన స్మార్ట్‌ఫోన్. ఇది గెలాక్సీ Read more

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది భారత పౌరులు మృతి
Fatal road accident in Saudi Arabia.. 9 Indian citizens killed

సౌదీ ఆరేబియా: సౌదీ ఆరేబియా లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది భారత పౌరులు దుర్మరణం పాలయ్యారు. సౌదీ అరేబియా Read more

బీసీసీఐ కొత్త నిబంధనలు!
బీసీసీఐ కొత్త నిబంధనలు!1

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఓటమిపై భారత క్రికెట్ బోర్డు తీవ్రంగా స్పందించింది. భారత జట్టుపై బిసిసిఐ కొరడా ఝుళిపించిందని, ఆటపై వారి దృష్టిని తిరిగి పొందడానికి కఠినమైన Read more

అన్ని రాష్ట్రాల రాజధానుల్లో స్వామి ఆలయాలు: టీటీడీ
TTD-has-decided-to-build-temples-of-Lord-Venkateswara-in-all-the-state-capitals-of-the-country

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల వేంకటేశ్వరుడి ప్రాముఖ్యతను మరింతగా పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *