బంగారు గనిలోంచి 78 మృతదేహాల వెలికితీత

దక్షిణాఫ్రికాలోని బంగారు గనిలో జరిగిన అక్రమ తవ్వకాల వల్ల అనేకులు మరణించారు. చనిపోయిన వారి మృత దేహాలను వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు ఈ గనిలోంచి 78 మంది కార్మికుల మృత దేహాలను వలంటీర్లు బయటికి తీసుకొచ్చారు. మరో 200 మందిని కాపాడారు. గతేడాది కొంతమంది గని కార్మికులు ఎలాంటి అనుమతి లేకుండా ఉద్దేశపూర్వకంగా స్టిల్‌ఫొంటైన్ గనిలోకి ప్రవేశించారు. వారి విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్న అధికారులు వారికి ఆహారం, నీటి సరఫరాను నిలిపివేశారు. అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లిన అనేక మంది కొన్ని నెలల తరబడి ఈ గని లోపలే నివసిస్తున్నారని కథనాలు వచ్చాయి. అంతకుముందు ఈ గనిలో ఉన్న భయంకరమైన పరిస్థితిని చూపించే వీడియోలు ఆందోళన కలిగించాయి.

గతేడాది దేశవ్యాప్తంగా అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పోలీసులు ఆపరేషన్ మొదలు పెట్టినప్పటి నుంచి వారు అక్కడే ఉంటున్నారు. ఇటీవల బయటకు వచ్చిన వీడియోల్లోని ఒక దాంట్లో గని లోపల మృతదేహాలను కవర్లలో చుట్టినట్లు కనిపించింది. అయితే ఈ వీడియోను బీబీసీ స్వతంత్రంగా వెరిఫై చేయలేదు. మరో వీడియోలో బక్కచిక్కిన శరీరాలతో కొంతమంది అక్కడ తిరుగుతున్న దృశ్యాలున్నాయి. గనిలో ఉన్న వారిని రక్షించాలని కోర్టు వారం రోజుల క్రితం ఆదేశించడంతో చాలా ఆలస్యంగా సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఈ సహాయక చర్యలు ప్రారంభించకముందే 1,500 మందికి పైగా కార్మికులు గని నుంచి బయటికి వచ్చారని పోలీసులు చెప్పారు.

దక్షిణాఫ్రికాలో అక్రమంగా గనులు తవ్వేవారిని ‘జామాజామా’ అంటారు. ఈ కార్మికుల మీద ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన తర్వాత వంద మందికిపైగా మరణించినట్లు కథనాలు వచ్చాయి. ఈ గని జోహెన్నెస్‌బర్గ్‌కు 145 కిలోమీటర్ల దూరంలో ఉంది.అయితే మృతుల సంఖ్యను అధికారులు అధికారికంగా ప్రకటించడంలేదని, ఎంతమంది చనిపోయారో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోందని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు.

Related Posts
America :26/11 దాడి నిందితుడు తహవ్వూర్ రాణా – అమెరికా సుప్రీంకోర్టు విచారణ
26/11 దాడి నిందితుడు తహవ్వూర్ రాణా – అమెరికా సుప్రీంకోర్టు విచారణ

ముంబై 26/11 ఉగ్రవాద దాడి నిందితుడు తహవూర్ రాణాను భారతదేశానికి అప్పగించడాన్ని నిలిపివేయాలని కోరుతూ చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్‌కు సమర్పించిన కొత్త దరఖాస్తును అమెరికా సుప్రీంకోర్టు Read more

కజకిస్తాన్‌లో విమానం కూలిపోయిన ఘటనపై రష్యా హెచ్చరిక
russia warns

కజకిస్తాన్‌లో బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను పరిశీలిస్తూ, రష్యా ప్రభుత్వం మీడియా సంస్థలకు విమానం కూలిపోవడానికి కారణంగా ఊహలను Read more

trump putin talks: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు ట్రంప్-పుతిన్ చర్చలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు ట్రంప్-పుతిన్ చర్చలు

రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. Read more

సోనియా వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు
సోనియా వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలైన తొలి రోజు, రాష్ట్రపతి ప్రసంగంపై అధికార, విపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా Read more